LIC Dhan Sanchay: ఎల్‌ఐసీ నుంచి మరో ఆకర్షణీయమైన పాలసీ.. రూ. 22 లక్షలు పొందే అవకాశం.

ప్రముఖ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొంగొత్త పాలసీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్స్‌ను ప్రవేశ పెట్టిన ఎల్‌ఐసీ తాజాగా మరో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. 'ధన్‌ సంచయ్‌'...

LIC Dhan Sanchay: ఎల్‌ఐసీ నుంచి మరో ఆకర్షణీయమైన పాలసీ.. రూ. 22 లక్షలు పొందే అవకాశం.
LIC Crime News
Follow us

|

Updated on: Feb 19, 2023 | 7:36 AM

ప్రముఖ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొంగొత్త పాలసీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో ఆకర్షణీయమైన స్కీమ్స్‌ను ప్రవేశ పెట్టిన ఎల్‌ఐసీ తాజాగా మరో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ‘ధన్‌ సంచయ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీలో వినియోగదారులకు మొత్తం 4 రకాల ఆప్షన్స్‌ అందించింది. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్‌తోపాటు గ్యారెంట్‌ ఇన్‌కమ్‌ కూడా అందిస్తోంది. A,B,C,D అనే ఆప్షన్స్‌లో ఈ పాలసీని అందిస్తున్నారు.

పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. పాలసీ 5 నుంచి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్. ఇక నాలుగు ఆప్షన్స్‌ విషయానికొస్తే A, B ఆప్షన్స్‌లో హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000గా ఉంటుంది.

ఈ స్కీమ్‌లో చేరడానికి పాలసీ దారుడి వయసు కనీనం మూడేళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఇక పాలసీ తీసుకోవాలనుకునే వారు ఏడాదికి కనీస ప్రీమియంగా రూ. 30,000గా ఉంది. 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ ప్లాన్‌లో కనిష్టంగా రూ. 2.5 లక్షలు గరిష్టంగా రూ. 22 లక్షల వరకు సమ్‌ అష్యూర్డ్‌ను పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..