AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: పిల్లల కోసం ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ.. రోజుకు రూ.150 డిపాజిట్‌ చేస్తే రూ.26 లక్షలు

LIC Policy: ఎల్ఐసీ జీవన్ తరుణ్ అనేది పిల్లల విద్య, భవిష్యత్తు ప్రణాళికలకు ఆర్థిక సహాయం అందించే బీమా పథకం. ఇది పొదుపు, రక్షణ రెండింటి ప్రయోజనాలను అందించే పరిమిత ప్రీమియం చెల్లింపు పథకం. ఈ పథకం కింద పాలసీదారుడు తన..

LIC Policy: పిల్లల కోసం ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ.. రోజుకు రూ.150 డిపాజిట్‌ చేస్తే రూ.26 లక్షలు
Subhash Goud
|

Updated on: Aug 09, 2025 | 7:40 AM

Share

LIC Jeevan Tarun Plan: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, సురక్షితమైన భవిష్యత్తును కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా సార్లు ఆర్థిక సమస్యలు పిల్లల కలలను నెరవేరకుండా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) “జీవన్ తరుణ్ పాలసీ” పిల్లలకు మెరుగైన భవిష్యత్తును భద్రపరచడానికి ఒక గొప్ప మార్గం.

ఇది కూడా చదవండి: Gold Price Today: రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతో తెలుసా?

పిల్లల విద్య, యువత ముఖ్యమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకంలో మీరు రోజుకు కేవలం రూ. 150 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 26 లక్షల నిధిని సృష్టించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ అంటే ఏమిటి?

ఎల్ఐసీ జీవన్ తరుణ్ అనేది పిల్లల విద్య, భవిష్యత్తు ప్రణాళికలకు ఆర్థిక సహాయం అందించే బీమా పథకం. ఇది పొదుపు, రక్షణ రెండింటి ప్రయోజనాలను అందించే పరిమిత ప్రీమియం చెల్లింపు పథకం. ఈ పథకం కింద పాలసీదారుడు తన బిడ్డకు 25 సంవత్సరాలు నిండే వరకు నిర్ణీత కాలానికి పెట్టుబడి పెడతాడు. ప్రతిఫలంగా పెద్ద మొత్తాన్ని పొందుతాడు.

రోజుకు రూ.150 పెట్టుబడి పెట్టి 26 లక్షలు

ఈ పాలసీలో మీరు రోజుకు రూ. 150 మాత్రమే డిపాజిట్ చేస్తే ఒక నెలలో మొత్తం పెట్టుబడి రూ. 4,500 ఇన్వెస్ట్‌ చేస్తారు. ఈ మొత్తం ఒక సంవత్సరంలో రూ. 54,000. ఇప్పుడు మీరు ఈ పాలసీని బిడ్డకు 1 సంవత్సరం వయసులో ప్రారంభించి 25 సంవత్సరాలు కొనసాగించారని అనుకుందాం. పాలసీ చివరిలో మీరు రూ. 26 లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు. ఇందులో సమ్ అష్యూర్డ్, వార్షిక బోనస్, చివరి అదనపు బోనస్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: త్వరపడండి.. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్‌..బెనిఫిట్స్‌ ఇవే

పాలసీలో చేరడానికి వయోపరిమితి ఎంత?

ఈ పథకాన్ని పొందడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజులు. గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. పిల్లల వయస్సు 12 సంవత్సరాలు పైబడి ఉంటే ఈ పథకాన్ని వారి కోసం తీసుకోలేరు. పాలసీ మొత్తం వ్యవధి పిల్లల వయస్సు ప్రకారం నిర్ణయిస్తారు.

మీకు డబ్బు ఎప్పుడు వస్తుంది?

ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే ఏదైనా కారణంగా మీరు మధ్యలో డబ్బును ఉపసంహరించుకోవచ్చు. బిడ్డకు 20 సంవత్సరాలు నిండినప్పుడు అప్పటి నుండి 24 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని డబ్బు తిరిగి పొందుతారు. దీని తరువాత, 25వ సంవత్సరంలో మీరు మెచ్యూరిటీ మొత్తాన్ని కలిపి పొందుతారు. ఇందులో మిగిలిన హామీ మొత్తం, అన్ని బోనస్‌లు ఉంటాయి.

పన్ను మినహాయింపు, రుణ ప్రయోజనం:

ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సమయంలో పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లేదా ప్రమాదంలో మరణ ప్రయోజనం పొందినప్పుడు ఆ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సెక్షన్ 10(10D) కింద వస్తుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..కీలక ప్రకటన చేసిన వాతావరణ శాఖ

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి