LIC: భారతీయ కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ ఐదో స్థానం.. మొదటి స్థానంలో ఏదంటే..!

ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్లు. అయితే, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ అన్ని కంపెనీలలో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో మార్కెట్ విలువ పరంగా ఐదో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఎల్ఐసీ మార్కెట్‌ క్యాప్‌ 7 లక్షల కోట్లకు చేరుకోగా.. ఈ క్రమంలోనే 6.93 లక్షల కోట్ల రూపాయల ఎంక్యాప్‌తో ఆరో స్థానానికి పడిపోయింది. ఇక ఇంట్రాడేలో జీవన కాల గరిష్టం దగ్గర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్ విలువ ఏకంగా..

LIC: భారతీయ కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ ఐదో స్థానం.. మొదటి స్థానంలో ఏదంటే..!
Lic
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2024 | 10:05 AM

ఎల్‌ఐసీ ఏర్పాటై 67 ఏళ్లు పూర్తయ్యింది. నేటికీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత విశ్వసనీయ బీమా కంపెనీగా తన ఖ్యాతిని నిలుపుకుంది. అందువల్ల, మార్కెట్ విలువ పరంగా దేశంలోని వివిధ కంపెనీలలో ఎల్‌ఐసి టాప్ లిస్ట్‌లోకి వచ్చింది. అత్యంత విలువైన భారతీయ కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్లు. అయితే, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ అన్ని కంపెనీలలో అగ్రస్థానంలో ఉంది.

భారత్‌లో మార్కెట్ విలువ పరంగా ఐదో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఎల్ఐసీ మార్కెట్‌ క్యాప్‌ 7 లక్షల కోట్లకు చేరుకోగా.. ఈ క్రమంలోనే 6.93 లక్షల కోట్ల రూపాయల ఎంక్యాప్‌తో ఆరో స్థానానికి పడిపోయింది. ఇక ఇంట్రాడేలో జీవన కాల గరిష్టం దగ్గర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్ విలువ ఏకంగా రూ. 7.23 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

అలాగే ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 19.64 లక్షల కోట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెండో స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 15.13 లక్షల కోట్లతో ఉండగా, ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 10.66 లక్షల కోట్లుతో మూడో స్థానంలో ఉంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 7.02 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

గత నెలలో ఎల్ఐసీ.. మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (SBI) దాటేసింది. దీంతో దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా (PSU) కూడా అవతరించింది. ఎస్బీఐ ఎంక్యాప్ రూ. 6.24 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ఐసీ స్టాక్ 2022 మే నెలలో ఐపీఓగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా, ఈ సంస్థ సుమారు 3.5 శాతం వాటా లేదా 22.13 కోట్ల షేర్లను విక్రయించింది భారత ప్రభుత్వం. అయితే ప్రారంభంలో ఆశించినంత రిటర్న్స్ ఇవ్వలేదు. ఏడాది గడిచినా ఇష్యూ ధరను (రూ. 949) కూడా దాటలేదు. ఇటీవల ఫిబ్రవరి 5న తొలిసారి రూ. 1000 మార్కును అధిగమించింది. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి