- Telugu News Photo Gallery Business photos Sim transfer rules know after how much time telecom company tranfer your number to otherone
SIM Card: మీ సిమ్ కార్డుకు రీఛార్జ్ చేయడం లేదా? ఎన్నిరోజులకు సిమ్ నంబర్ మరొకరికి బదిలీ చేస్తారు!
రీఛార్జ్ కోసం 6 నెలల నుంచి 9 నెలల వరకు గడువు ఇస్తుంది సదరు కంపెనీ. ఈ సందర్భంలో కూడా నంబర్‌ను మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక వేళ ఆ తర్వాత కూడా సిమ్ కార్డుని రీఛార్జ్ చేయకుంటే అనేక హెచ్చరికలు చేస్తుంటుంది కంపెనీ. అయినా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోకపోతే కంపెనీ సిమ్‌ను బ్లాక్ చేస్తుంది.కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారులకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఒకరి నుంచి మరొకరికి సిమ్ నంబర్ బదిలీ..
Updated on: Feb 11, 2024 | 10:45 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది తమ మొబైల్‌లో డ్యుయల్ సిమ్ ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద డబుల్ సిమ్ కార్డులు ఉంటాయి. కొంత మంది అయితే మూడు లేదా నాలుగు సిమ్ కార్డులను వాడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయరు.

ఇలా రీఛార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ బ్లాక్ చేస్తుంది. టెలికాం నియమం ప్రకారం.. నిర్ధిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే ఆ నంబర్ మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫర్ చేస్తాయి. మీ సిమ్ రీఛార్జ్ చేయకుంటే ఆ నంబర్‌ను వేరొకరికి ఇవ్వడానికి ముందు కంపెనీలు అనేక దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే ముందుగా 60 రోజుల పాటు సిమ్ కార్డును రీఛార్జ్ చేయకుండా ఉన్నట్లయితే అది డియాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు సిమ్‌కు రీఛార్జ్ చేయనందున యాక్టివేట్‌లో ఉండకుండా డీయాక్టివేట్‌లో ఉండిపోతుంది. ఆ తర్వాత కూడా రీఛార్జ్ కోసం 6 నెలల నుంచి 9 నెలల వరకు గడువు ఇస్తుంది సదరు కంపెనీ.

ఈ సందర్భంలో కూడా నంబర్‌ను మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక వేళ ఆ తర్వాత కూడా సిమ్ కార్డుని రీఛార్జ్ చేయకుంటే అనేక హెచ్చరికలు చేస్తుంటుంది కంపెనీ. అయినా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోకపోతే కంపెనీ సిమ్‌ను బ్లాక్ చేస్తుంది.

కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారులకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఒకరి నుంచి మరొకరికి సిమ్ నంబర్ బదిలీ చేయడానికి ఏడాది సమయం పడుతుంది. అప్పుడు మాత్రమే వేరొకరికి అందిస్తారు.




