- Telugu News Photo Gallery Fashion show organize by Hamstec Fashion Designing Institute at Madapur N Convention Centre, Hyderabad
Fashion Show 2024: హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో ఏర్పాటు.. వయ్యారి నడకతో అలరించిన మోడల్స్
హైదరాబాద్‌కి చెందిన హామ్‌స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శుక్రవారం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించిన షో టైమ్ ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంది.ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నీతాలుల్లా ఆధ్వర్యంలో.. రెండు వందల మందికి పైగా ఔత్సాహిక డిజైనర్లు సృష్టించిన 1000 రకాల సరికొత్త డిజైన్లు ర్యాంప్‌పై మెరిశాయి.
Updated on: Feb 10, 2024 | 11:23 AM

హైదరాబాద్‌కి చెందిన హామ్‌స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శుక్రవారం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించిన షో టైమ్ ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంది.

ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నీతాలుల్లా ఆధ్వర్యంలో.. రెండు వందల మందికి పైగా ఔత్సాహిక డిజైనర్లు సృష్టించిన 1000 రకాల సరికొత్త డిజైన్లు ర్యాంప్‌పై మెరిశాయి. రెండు రోజులపాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వివిధ రౌండ్లలో కొనసాగుతుంది. హామ్ స్టెక్ ఫ్యాషన్ డిజైన్ కళాశాల నుంచి 200 పైగా ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫ్యాషన్ షోను 3 విభాగాలలో ప్రదర్శిస్తారు.

మధ్యలో లంచ్, స్నాక్ బ్రేక్‌లు ఉంటాయి. ఫ్యాషన్ షో తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం విద్యార్థులు 2 - 3 నెలల ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించారు. లెహంగాలు, చీరలు, పలాజోలతోపాటు డ్రెస్‌లలో అద్భుతమైన డిజైనర్ వేర్‌లతో ప్రదర్శన గ్రాండ్‌గా జరిగింది.

చందేరీ, కాటన్-సిల్క్, జార్జెట్, షిఫాన్ వంటి వివిధ రకాల బట్టలపై భారతీయ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు. ఫ్యాషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి వినూత్న కట్‌లు, ప్రింట్లు వేసిన దుస్తులతో మోడల్స్ ర్యాంప్‌పై అందంగా నడుస్తూ ప్రదర్శన ఇచ్చారు.




