Fake GST: మీ ఇంటికి నకిలీ GST నోటీసు వచ్చిందా? ఈ విధంగా క్రాస్‌ చెక్‌ చేసుకోండి!

ఒక వస్తువు లేదా సేవ కోసం వసూలు చేసే ధరకు జీఎస్టీ పన్ను వర్తించబడుతుంది. మనం ఒక స్టోర్‌లో వస్తువును కొనుగోలు చేసినప్పుడు, బిల్లు మొత్తానికి కొంత శాతం జీఎస్టీ వేస్తారు. ఈ జీఎస్టీ సొమ్ము ప్రభుత్వానికి వెళ్తుంది. అయితే ఏ వస్తువులు లేదా సేవలు అందించకపోయినా జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను రూపొందించే వారు ఉన్నారు. ఇది నకిలీ ఇన్‌వాయిస్‌గా పరిగణిస్తారు.

Fake GST: మీ ఇంటికి నకిలీ GST నోటీసు వచ్చిందా? ఈ విధంగా క్రాస్‌ చెక్‌ చేసుకోండి!
Gst
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2024 | 6:57 AM

పన్ను ఎగవేత భారతదేశంలో చాలా సాధారణ సమస్య. అలాగే ప్రభుత్వానికి నిరంతరం ఇదో తలనొప్పి. జీఎస్టీ అమలులోకి వచ్చినా పన్ను ఎగవేత ఆగలేదు. చాలా మంది వ్యాపారులు బిల్లులు అస్సలు జనరేట్ చేయడం లేదు. వినియోగదారుడు అడగకుంటే బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. అలాగే నకిలీ బిల్లులు సృష్టించి వినియోగదారులకు ఇచ్చే వ్యాపారులు కూడా ఉన్నారు. అలాగే, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి నకిలీ ఇన్‌వాయిస్‌లను (నకిలీ GST ఇన్‌వాయిస్) సృష్టించే చాలా మంది వ్యాపారులు ఉన్నారు. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయానికి గండి పడుతుందని అంటున్నారు.

ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంతో ప్రజలకు సహాయం చేస్తోంది. కొంత మంది దీనిని సద్వినియోగం చేసుకొని సామాన్య ప్రజలను, పన్ను చెల్లింపుదారులను మోసాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు నకిలీ GST నోటీసులు అందుకున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి నోటీసులు అందుకున్న తర్వాత, పన్ను చెల్లింపుదారులు ఆ విషయంపై సరైన సమాచారం పొందే వరకు కొంత వరకు ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితిలో దానిని నియంత్రించడానికి ఏ పద్ధతిని అవలంబించవచ్చు అనేది తలెత్తే అతిపెద్ద ప్రశ్న? దీని గురించి తెలుసుకుందాం.

మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

CBIC వెబ్‌సైట్‌లో ‘వెరిఫై CBIC-DIN’ విండోను ఉపయోగించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఏదైనా నోటీసును తనిఖీ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు డైరెక్టరేట్ ఆఫ్ డేటా మేనేజ్‌మెంట్, CBIC ఆన్‌లైన్ పోర్టల్‌లో DIN యుటిలిటీ సెర్చ్‌ ఉపయోగించి జీఎస్టీ నకిలీదా? ఒరిజినలా అనేది గుర్తించువచ్చు. నకిలీ బిల్లు​ఉన్నట్లు అనుమానం వచ్చినట్లయితే పన్ను చెల్లింపుదారులు వెంటనే DGGI/CBIC అధికారులకు నివేదించవచ్చు.

నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటి?

ఒక వస్తువు లేదా సేవ కోసం వసూలు చేసే ధరకు జీఎస్టీ పన్ను వర్తించబడుతుంది. మనం ఒక స్టోర్‌లో వస్తువును కొనుగోలు చేసినప్పుడు, బిల్లు మొత్తానికి కొంత శాతం జీఎస్టీ వేస్తారు. ఈ జీఎస్టీ సొమ్ము ప్రభుత్వానికి వెళ్తుంది. అయితే ఏ వస్తువులు లేదా సేవలు అందించకపోయినా జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను రూపొందించే వారు ఉన్నారు. ఇది నకిలీ ఇన్‌వాయిస్‌గా పరిగణిస్తారు.

వస్తువులు లేదా సేవలను అందించే ప్రతి నమోదిత సంస్థకు GSTIN జారీ చేస్తారు. జీఎస్టీఐఎన్‌ అనేది స్టేట్ కోడ్ నంబర్, పాన్ నంబర్, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ల కలయిక. ఇది 15 అంకెల ప్రత్యేక సంఖ్య. మీరు GST పోర్టల్ ( www.gst.gov.in/ ) కి వెళితే, మీరు GST నంబర్‌ని తనిఖీ చేయవచ్చు. పోర్టల్‌లోని సెర్చ్ ట్యాక్స్‌పేయర్ విభాగానికి వెళ్లి, నంబర్ ద్వారా సెర్చ్ చేయండి. నంబర్ నిజమైనదైతే అది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడింది..? వారి చిరునామా ఏమిటో పూర్తి వివరాలు కనిపిస్తాయి.

అలాగే, జీఎస్టీ బిల్లులోని ఇన్‌వాయిస్ నంబర్, తేదీ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. అలాగే వస్తువుల విక్రయానికి హెచ్‌ఎస్‌ఎన్‌ కోడ్ ఉంది. సేవల విక్రయానికి సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ (SAC) కేటాయిస్తారు. ఈ రెండు కోడ్ నంబర్లను జీఎస్టీ పోర్టల్‌లో ధృవీకరించవచ్చు. అలాగే, విక్రేత పన్ను చెల్లింపు చరిత్రను కూడా జీఎస్టీ పోర్టల్‌లో తనిఖీ చేయవచ్చు. నిర్దిష్ట బిల్లులో నమోదు చేస్తే ప్రభుత్వానికి పన్ను సమర్పించబడిందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

నకిలీ సమన్‌లు డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN)ని కలిగి ఉన్నందున నిజమైనవిగా కనిపించవచ్చు. అయితే ఈ సంస్థల విషయంలో ఈ DIN నంబర్‌లు DGGI ద్వారా జారీ చేయవు. వీటిని పోర్టల్‌ని సందర్శించడం ద్వారా క్రాస్ చెక్ చేయవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి DGGI పోలీసులకు తెలియజేయడం, నకిలీ, మోసపూరిత సమన్లు ​తయారు చేయడం, పంపడం వంటి వారిపై ఫిర్యాదులు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!