Deepika Padukone: ‘కల్కి 2898 AD’ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..

ప్రస్తుతం ఆమె 'కల్కి 2898 AD' సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈమూవీని చూసేందుకు అడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Deepika Padukone: 'కల్కి 2898 AD' సినిమాకు దీపికా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..
Deepika Padukone
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 6:55 AM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు హిందీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోతున్నారు. “ఫిమేల్ హిట్ మెషిన్”గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దీపికా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. పాన్ ఇండియా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈమూవీని చూసేందుకు అడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కొన్నాళ్లుగా ఈ మూవీ గురించి అనేక రూమర్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలకపాత్రలలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నటిస్తున్నందుకు దీపికా ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా కోసం సుమారు రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటుందట దీపికా. ఇటీవలే జవాన్, పఠాన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది దీపికా. ఈ చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

‘కల్కి 2898 AD’ చిత్రాన్ని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీని తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. అత్యాధునిక సాంకేతికతతో భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్పూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ