EMI: EMI చెల్లించడానికి చేతిలో డబ్బులు లేవా..! అప్పుడు ఈ 5 మార్గాలు తెలుసుకోండి..

EMI: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు డబ్బు కొరతగా ఉంటుంది. అదే సమయంలో EMI భారం తలపై ఉంటే అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు వడ్డీ కూడా

EMI: EMI చెల్లించడానికి చేతిలో డబ్బులు లేవా..! అప్పుడు ఈ 5 మార్గాలు తెలుసుకోండి..
Rupee
Follow us

|

Updated on: Aug 30, 2021 | 6:58 PM

EMI: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు డబ్బు కొరతగా ఉంటుంది. అదే సమయంలో EMI భారం తలపై ఉంటే అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు వడ్డీ కూడా పెరుగుతుంటుంది. రుణ మొత్తం కంటే ఎక్కువ వడ్డీ భారం ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితిలో సాధారణంగా అందరు డబ్బు వచ్చే మార్గాల గురించి వెతుకుతారు. అలాంటి కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం.

1 బీమా పాలసీ మీరు చాలాకాలం క్రితం బీమా పాలసీ తీసుకుంటే అది పెద్దగా ప్రయోజనాన్ని అందించదు. అటువంటి పాలసీలో తక్కువ రాబడి లభిస్తుంది. బీమా రక్షణ కూడా అంతగా ఉండదు. అప్పుడు దీనిని సరెండర్ చేయవచ్చు. వచ్చిన డబ్బుతో మీరు EMI ని కట్టుకోవచ్చు.

2. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు గణనీయంగా తగ్గింది. ఇప్పుడు FD లో మునుపటిలాగా ఎక్కువ రిటర్న్ రావడం లేదు. ఉద్యోగ విరమణ తర్వాత పొందిన డబ్బును 30% పన్ను పరిధిలోకి తెచ్చిన తర్వాత ప్రయోజనం మరింత తగ్గింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4%చొప్పున మాత్రమే డబ్బు చేతికి వస్తుంది. అలాంటి సమయంలో ఎఫ్‌డి డబ్బును వెనక్కి తీసుకొని 9-10 శాతం వడ్డీ వసూలు చేస్తున్న EMI రుణాన్ని చెల్లిస్తే మంచిది.

3. కారుకు వ్యతిరేకంగా రుణం మీరు కారుపై ఎలాంటి రుణం తీసుకోకపోతే బ్యాంకులు రుణం ఇవ్వవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు అధికారులతో మాట్లాడాల్సి ఉంటుంది. కారుపై బ్యాంకులు 12-15 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. కానీ కారు కండీషన్ బాగుండాలి కారు మంచి స్థితిలో ఉండాలి. కారు 5 సంవత్సరాల కంటే పాతది కాకూడదు అప్పుడే రుణం లభిస్తుంది.

4. బంగారంపై రుణం మీరు డబ్బు అత్యవసరం అయినప్పుడు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు. బంగారం పెట్టుబడికి ఉత్తమ మార్గం. ఈ విధంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న EMI రుణాన్ని చెల్లిస్తే బాగుంటుంది.

5. PPF నుంచి రుణం మీకు పిపిఎఫ్ స్కీమ్ ఉంటే దానిపై రుణం తీసుకోవచ్చు. 1% వడ్డీ రేటుతో PPF బ్యాలెన్స్‌పై రుణం తీసుకోవడం సులభం. మూడు సంవత్సరాల కాలానికి PPF పై రుణం తీసుకోవచ్చు. ఈ 1% రుణాన్ని భరించి 10% రుణం చెల్లించడానికి ఉపయోగించవచ్చు. మీరు మూడు సంవత్సరాలలో PPF రుణాన్ని చెల్లించకపోతే అప్పుడు 6% వడ్డీ చొప్పున వసూలు చేస్తారని గుర్తుంచుకోండి.

Makhana Benefits: మఖానాతో గుండె, ముత్రపిండాల సమస్యలకు చెక్..! పరగడుపున తింటే 5 అద్భుత ప్రయోజనాలు..

Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు రావొచ్చు? సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందా? ICMR నిపుణుల అంచనా

Telangana Inter Admissions: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు