AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు రావొచ్చు? సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందా? ICMR నిపుణుల అంచనా

Covid-19 Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా.. ఉండదా? ఉంటే.. ఎప్పుటి నుంచి మొదలుకాబోతుంది? థర్డ్ వేవ్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు కోట్లాది మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి.

Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడు రావొచ్చు? సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందా? ICMR నిపుణుల అంచనా
Third Wave Coronavirus
Janardhan Veluru
|

Updated on: Aug 30, 2021 | 6:27 PM

Share

Covid-19 Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా.. ఉండదా? ఉంటే.. ఎప్పుటి నుంచి మొదలుకాబోతుంది? థర్డ్ వేవ్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు కోట్లాది మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని ఇప్పటికే కొందరు వైద్య నిపుణులు అంచనావేశారు. పండుగల సీజన్‌‌ సహా పలు ఇతర కారణాలు థర్డ్ వేవ్‌కు దారితీయొచ్చని అంచనావేస్తున్నారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులు, ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారే ఎక్కువగా బాధితులయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలెర్ట్ చేసింది. ఈ మేరకు వైద్య మౌలిక వసతులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.  ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఐసీఎంఆర్ నిపుణులు అంచనావేస్తున్నారు.

అదే సమయంలో దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో చెప్పడం సాధ్యంకాదని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ సమిరన్ పాండా అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా డేటాను పరిశీలించి అక్కడ ప్రభావం ఎలా ఉంటుందో అంచనావేయొచ్చని వివరించారు. దీని ఆధారంగా మరో వేవ్ దేశ వ్యాప్తంగా ఎప్పుడు వస్తుందో అంచనావేయడం కష్టమన్నారు.

ఈ కారణాలు మరో వేవ్‌కు దారితీయొచ్చు.. సహజంగా లేదా వ్యాక్సిన్ ద్వారా వచ్చిన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడం, డెల్టా తరహాలో మరింత వేగంగా వ్యాపించే వేరియంట్ రావడం, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, వ్యాక్సినేషన్ వీలైనంత ఎక్కువ మందికి ఇవ్వకపోవడం తదితర అంశాలు మరో వేవ్‌కు దారితీసే అవకాశముందన్నారు.

Also Read..

ఈ చేప ఎంత లక్కీనో.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.. క్షణకాలంలో చావు తప్పింది

ఏడేళ్ళ వయసు వరకూ పిల్లలకు నో ఎగ్జామ్స్.. తల్లిదండ్రులపై ఒత్తిడి తగ్గించాడానికేనట!