Fit India App: మీ ఫిట్‌నెస్‌కు యాప్ భరోసా.. ఫిట్ ఇండియా కోసం మీరు సిద్ధమా? అయితే ఈ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి!
సాధారణంగా అందరూ ఫిట్ గా ఉండాలనే అనుకుంటారు. కానీ, దానికి కావలసిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలీదు. శారీరకంగా చక్కగా ఉండాలంటే చేయాల్సిన వ్యాయామాలు.. తీసుకోవలసిన ఆహరం వంటి విషయాల గురించి ఎవరికీ అవగాహన ఉండదు.
Fit India App: కేంద్ర క్రీడలు మరియు యువత మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగింది. ఆయన వెంట యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రామాణిక్ ఉన్నారు. ప్రారంభించిన తర్వాత మంత్రికి భారత హాకీ టీమ్ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, స్పోర్ట్స్ రైటర్ అయాజ్ మెమన్, ఎయిర్ ఇండియా కెప్టెన్ అన్నీ దివ్య, ఫిట్ ఇండియా యాప్ ఎలా ఉపయోగించాలో వివరించారు. దీనితో పాటు, రోజూ అరగంట కొరకు ఫిట్‌నెస్ మోతాదు ప్రాథమిక మంత్రం కూడా దీనిలో పొందుపరిచారు. ‘ఫిట్ ఇండియా’ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.
సాధారణంగా అందరూ ఫిట్ గా ఉండాలనే అనుకుంటారు. కానీ, దానికి కావలసిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలీదు. శారీరకంగా చక్కగా ఉండాలంటే చేయాల్సిన వ్యాయామాలు.. తీసుకోవలసిన ఆహరం వంటి విషయాల గురించి ఎవరికీ అవగాహన ఉండదు. అంతేకాకుండా ఏ వయసులో ఎంత బరువు ఉండాలి? ఎంత పొడవు ఉంటె ఎంతవరకూ బరువు ఉండొచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా కొలుస్తారు? దానిని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలి? ఎంత సేపు నిద్రపోవాలి? మనం తీసుకున్న ఆహారానికి ఎంత శారీరక శ్రమ అవసరం అవుతుంది? ఇలాంటి విషయాల గురించి అస్సలు చాలామందికి తెలీదు. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియకపోయినా ఫర్వాలేదు. అన్నిటికీ ఒకటే జవాబు సిద్ధంగా ఉంది. అదే ఫిట్ ఇండియా యాప్. ఇది భారత ప్రభుత్వం సిద్ధం చేసిన యాప్. భారతీయులంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన స్వదేశీ యాప్.
ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ఫీచర్లు
- ఈ యాప్ ఫిట్‌నెస్ స్కోర్ ఫీచర్లు మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారో చూపుతుంది.
- మీరు వయస్సు ప్రకారం మీ స్వంత ఫిట్‌నెస్‌ను కూడా తెలుసుకోగలుగుతారు.
- యాప్ మై ప్లాన్ ఫీచర్‌తో మీరు మీ స్వంత లక్ష్యాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది మీ లక్ష్యం ప్రకారం ఫిట్‌నెస్ దినచర్యను ట్రాక్ చేయడం ద్వారా మొత్తం డేటాను నిల్వ చేస్తుంది. తద్వారా మీరు మీ పురోగతిని చూడగలరు.
- ఈ యాప్ ద్వారా, మీరు ఎక్కడి నుంచైనా ఇతర స్నేహితులతో పోటీ పడవచ్చు. అయితే, మీ సహచరులు కూడా ఈ యాప్‌ని కలిగి ఉండాలి.
- ఈ యాప్‌తో, మీరు ఎంత తింటారు, ఎంత నీరు తాగుతారు, ఎంత నిద్రపోతారు, ఇవన్నీ తెలుస్తాయి.
రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా పని చేసే విధంగా అభివృద్ధి చేశారు. 2019 సంవత్సరంలో, ప్రధాని ఫిట్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించారు.
గత రెండు సంవత్సరాలుగా, ఈ ప్రచారం ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైకిల్‌థాన్ అలాగే అనేక ఇతర ఫిట్‌నెస్ ప్రచారాల ద్వారా మిలియన్ల మందికి చేరుకుంది.
Also Read: EV Charging: ఎలక్ట్రిక్ కారు కొనడానికి ఎందుకు బెంగ? మొబైల్ చార్జింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండగా..