Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Charging: ఎలక్ట్రిక్ కారు కొనడానికి ఎందుకు బెంగ? మొబైల్ చార్జింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండగా..

మోత మోగిస్తున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునే మార్గాలు ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. కంపెనీలు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరి చూపూ పడింది.

EV Charging: ఎలక్ట్రిక్ కారు కొనడానికి ఎందుకు బెంగ? మొబైల్ చార్జింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండగా..
Ev Charging
Follow us
KVD Varma

|

Updated on: Aug 30, 2021 | 5:12 PM

EV Charging: మోత మోగిస్తున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునే మార్గాలు ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. కంపెనీలు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరి చూపూ పడింది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే, ఈ వాహనాలకు ఉన్న ఒకే ఒక పెద్ద చిక్కు దాని బ్యాటరీ. దీనిని రీఛార్జ్ చేయడం ఎలా అనేదే పెద్ద సమస్య. ఎందుకంటే ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసిన తరువాత అది ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఏమి చేయాలనేది అందరినీ కలవరపెట్టే అంశంగా మారింది. పెట్రోల్ లేదా డీజిల్ వాహనంలో ఇంధనం అయిపోతే, రెండు మూడు కిలోమీటర్ల లోపులో కచ్చితం ఉండే ఏదైనా బ్యాంకు వద్దకు వెళ్లి ఓ బాటిల్ తో దాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ, ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కుదరదు. రోడ్డు మీద బ్యాటరీ చార్జింగ్ అయిపోయిందా.. ఇక అంతే సంగతులు. ఈ ఒక్క కారణమే ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు వేగంగా మళ్ళకుండా అడ్డుపడుతోంది. దీనిని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గమనించారు. బ్యాటరీ చార్జింగ్ విషయంలో ఏమి చేయాలనే ప్రత్యామ్నాయాలను వారు వెలికి తెస్తున్నారు. అందులో భాగంగానే.. మొబైల్ చార్జింగ్ అనే వ్యవస్థను ఓ కంపెనీ ప్రవేశపెడుతోంది. దాని గురించి తెలుసుకుందాం.

మీ వద్ద ఎలక్ట్రిక్ వాహనం ఉంటే లేదా దానిని కొనాలని ఆలోచిస్తుంటే, ప్రయాణం మధ్యలో వాహనం యొక్క బ్యాటరీ అయిపోతే, అది ఎలా ఛార్జ్ చేయబడుతుంది? అయితే, ఇప్పుడు ఈ ఆందోళన ముగియనుంది. Ez4EV ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనం కోసం మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌ను తీసుకురాబోతోంది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వ్యాన్ పేరు ‘ఎజ్ ఉర్జా’. దీనిని తీసుకొచ్చిన కంపెనీ ప్రస్తుతం బ్యాటరీలు, ఛార్జర్ల తయారీలో పనిచేస్తోంది. ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌ సేవ నవంబర్ నెల నుండి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

దీని స్థానాన్ని ట్రాక్ చేయడం ద్వారా, మీరు మీ వాహనానికి సమీపంలో ఉన్న వ్యాన్‌కు కాల్ చేయవచ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్ వ్యాన్ వంటి వాహనంపై ఉంటుంది. దీనిని మొబైల్‌తో ట్రాక్ చేయవచ్చు. మీ కాల్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి సమీపంలో ఉన్న వ్యాన్ వస్తుంది . మీరు మ్యాప్‌ల సహాయంతో ATM ఎలాగైతే తెలుసుకుంటారో ఈ విధానం కూడా అలానే ఉంటుంది. ఈ సేవ 24×7 అందుబాటులో ఉంటుంది.

ద్విచక్ర వాహనాలు..వాణిజ్య వాహనాలు కూడా..

ఎజ్ ఉర్జా నెమ్మదిగానూ, వేగవంతంగానూ ఛార్జింగ్ చేయగల వ్యవస్థను కలిగి ఉంటుంది. ద్విచక్ర వాహనం, వాణిజ్య వాహనాలకు కూడా దీని సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఇది చిన్న పట్టణాలు, హైవేలలో తిరిగే వాహనాలను ఛార్జ్ చేస్తుంది. లిథియం-అయాన్ మాంగనీస్ ఫాస్ఫేట్ బ్యాటరీలను కలిపి ఉపయోగించడం ద్వారా వ్యాపారం చేయడం వల్ల లాభం చేకూరుతుందని కంపెనీ చెబుతోంది. ఇతర రకాల బ్యాటరీలలో ఇది అలా ఉండదు.