స్మార్ట్‌ఫోన్‌ నుంచి మంటలు.. విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో

స్మార్ట్‌ఫోన్‌ నుంచి మంటలు.. విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో

Phani CH

|

Updated on: Aug 28, 2021 | 5:45 PM

అమెరికాలో ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అందులో 128 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందిని ఖాళీ చేయించి..

అమెరికాలో ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అందులో 128 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందిని ఖాళీ చేయించి.. బస్సులో తరలించారు. ఈ ఘటనలో కొంత మందికి స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అలస్కా751 విమానం.. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లియెన్స్‌ నుంచి సీటెల్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు అదుపు చేసి, సీటెల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు. ప్రయాణికులతో పాటు సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: టిక్ టాక్ వీడియోలు చేసేందు ఫోన్‌‌న్ని దొంగలించిన చిలుక.. తప్పక చూడవలసిన వీడియో

Afghanistan Crisis: అఫ్గాన్ లో అనంత నిధి.. అది ఎవరికి దక్కేను..?? వీడియో