Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioPhone Next: త్వరలో జియోఫోన్‌ నెక్ట్స్‌.. అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌.. ఫ్రీ బుకింగ్‌ ఎప్పటి నుంచో తెలుసా..?

JioPhone Next: సంచనాలకు పేరున్న రిలయన్స్‌ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను..

JioPhone Next: త్వరలో జియోఫోన్‌ నెక్ట్స్‌.. అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌.. ఫ్రీ బుకింగ్‌ ఎప్పటి నుంచో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 30, 2021 | 1:30 PM

JioPhone Next: సంచనాలకు పేరున్న రిలయన్స్‌ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్‌ 10న ముఖేష్ అంబానీ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మొబైల్‌కు సంబంధించి డిమాండ్‌ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫోన్‌కి ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఫోన్‌ ధర ఎంతంటే..

కాగా, జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్‌ ఫీచర్లు, ధర ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకొస్తున్నట్లు టెక్‌ నిపుణులు ధృవీకరించారు.

ఈ ఫోన్‌ ఫీచర్స్‌..

ఈ ఫోన్‌ ఫీచర్స్‌ను పరిశీలిస్తే.. 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ఏప్రిల్‌-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల యూజర్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్‌టెల్‌, 119.63 మిలియన్లతో వొడాఫోన్‌ – ఐడియా, 16.44 మిలియన్‌ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో మొదటి స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్‌ చేస్తుంది. దీంతో రూరల్‌ ఇండియాని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్‌ లో విడుదల చేయనుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Offer: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్‌ ఆగస్టు 31తో ముగియనుంది..!

Infinix Hot 11: ఇన్ఫినిక్స్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర తక్కువే..!

Amazon Buy Now-Pay-Later: గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!