Infinix Hot 11: ఇన్ఫినిక్స్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర తక్కువే..!

 Infinix Hot 11:ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదల అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను..

Infinix Hot 11: ఇన్ఫినిక్స్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర తక్కువే..!
Infinix Hot 11
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Aug 30, 2021 | 8:59 PM

Infinix Hot 11:ప్రస్తుతం రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదల అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు. ఇక హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ నెలలో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇప్పటికే ఇన్ఫినిక్స్‌ నోట్‌ 7, ఇన్ఫినిక్స్‌ హాట్‌ 9, ఇన్ఫినిక్స్‌ హాట్‌ 10ఎస్‌ బడ్జెట్‌ ఫోన్లతో రూరల్‌ ఇండియాను టార్గెట్‌ చేస్తున్న ఇన్ఫినిక్స్ కంపెనీ.. తాజాగా ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్‌ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌ లైన్‌లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 ఫీచర్లు:

రెండు మెమోరీల వేరియంట్‌తో 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 ధర రూ.9,999గా ఉండనుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్‌ సంస్థ విడుదల చేయలేదు. కాగా, ప్రస్తుతం వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు పలు మొబైల్‌ తయారీ సంస్థలు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడనిదే జనాలు ఉండటం లేదు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లలోనే మునిగి తేలుతున్నారు. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా చూస్తున్నాయి. ఒకప్పుడు భారీ బడ్జెట్‌లలో ఉండే స్మార్ట్‌ఫోన్లు.. ప్రస్తుతం పది వేల రూపాయల లోపే లభిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండిపోతుంది..

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Amazon Buy Now-Pay-Later: గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!

Smartphone Sensors: స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే సెన్సార్ల గురించి మీకెంత తెలుసు? సెన్సార్లు ఎందుకు ఉపయోగపడతాయి?