Amazon Buy Now-Pay-Later: గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!
Amazon Buy Now-Pay-Later: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే..
Amazon Buy Now-Pay-Later: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్‌వర్క్ అఫిర్మ్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఫీచర్ పరీక్ష దశలో..
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, అలాగే ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ లేనందున చాలా మంది క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అమెజాన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఫిర్మ్ చెబుతోంది. త్వరగానే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
అయితే ఫ్లిప్‌కార్టులో Flipkart Pay latter ఆప్షన్ ఉంది. ఇది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే వస్తుంది. ఇందులో రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు అమౌంట్ ఉంటుంది. మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇందులో నుంచి డబ్బులు కట్ అవుతాయి. తర్వాత నెల మొదటి వారంలో ఎంత మొత్తం ఖర్చు చేశామో అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ వాయిదా పద్దతిలో చెల్లించే విధానం బై నౌ-పే లేటర్ తీసుకురానుంది.