Samsung Cloud: మీరు సామ్‌సంగ్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీ డేటా అంతా..

Samsung Cloud: ప్రస్తుతం డేటా స్టోరేజ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంతా క్లౌడ్‌లోనే స్టోర్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంస్థలు ఈ క్లౌడ్‌ స్టోరేజ్‌ అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి క్లౌడ్‌ సేవలను...

Samsung Cloud: మీరు సామ్‌సంగ్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీ డేటా అంతా..
Samsung Cloud
Follow us

|

Updated on: Aug 30, 2021 | 11:26 AM

Samsung Cloud: ప్రస్తుతం డేటా స్టోరేజ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంతా క్లౌడ్‌లోనే స్టోర్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంస్థలు ఈ క్లౌడ్‌ స్టోరేజ్‌ అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి క్లౌడ్‌ సేవలను అందిస్తోన్న వాటిలో సామ్‌సంగ్‌ క్లౌడ్‌ ఒకటి. సామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది కంపెనీ. అయితే తాజాగా తమ యూజర్లను సామ్‌సంగ్‌ ఈ విషయమై అలర్ట్‌ చేసింది. మరికొన్ని రోజుల్లో సామ్‌సంగ్‌ క్లౌడ్‌ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే యూజర్లు క్లౌడ్‌లో ఉన్న తమ ఫొటోలు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్‌ 30 తర్వాత నుంచి ఇకపై సామ్‌సంగ్‌ క్లౌడ్‌ సేవలు పనిచేయవని ప్రకటన జారీ చేసింది.

ఒకవేళ యూజర్లు తమ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోకపోతే నిర్ధేశించిన సమయానికి ఫొటోలు వాటంతటవే డిలీట్ అవుతాయని కంపెనీ తెలిపింది. ఇక ప్రీమియం స్టోరేజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న వారికి ఆగస్టు 1 నుంచి సేవల నిలిపివేత ప్రారంభమైందని. యూజర్లకు సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. సామ్‌సంగ్‌ తమ యూజర్ల కోసం కాంటాక్ట్స్‌, క్యాలెండర్స్‌తో పాటు ఫొటోలను కూడా బ్యాకప్‌ అందిస్తోంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఫొటోలకు బ్యాకప్‌ సేవలను నిలిపివేసింది. ఈ కారణంగానే క్లౌడ్‌లో ఉన్న తమ ఫొటోలను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది. సామ్‌సంగ్‌ క్లౌడ్‌ సేవలను నిలిపివేసే విషయంలో యూజర్లను రెండు గ్రూపులుగా విభించింది. గ్రూప్‌ 1లో ఉన్న వారి క్లౌడ్‌ డేటాను సెప్టెంబర్‌ 30 నాటికి, గ్రూప్‌ 2లో ఉన్న వారి ఫొటోలను నవంబర్‌ చివరి తొలగించనున్నట్లు ప్రకటించారు.

Samsung

క్లౌడ్‌లో ఉన్న ఫొటోలను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

క్లౌడ్‌లోఉన్న మీ ఫొటోలను డౌనల్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లోని సెట్టింగ్‌ యాప్‌లోకి వెళ్లాలి అనంతరం అందులో సామ్‌సంగ్‌ క్లౌడ్‌ను క్లిక్‌ చేయాలి. తర్వాత డేటా డౌన్‌లోడ్‌, బ్యాకప్‌ డేటా వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. డేటా డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేసి మీ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఈ ఫొటోలను మొమోరీ కార్డులో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ సేవ్‌ చేసుకోవచ్చు. అలాగే వన్‌డ్రైవ్‌కు కనెక్ట్‌ చేసుకున్న వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లోనే తమ ఫొటోలను మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కు బ్యాకప్‌ చేసుకోవచ్చు.

Also Read: ఇప్పుడు కోట్లువిలువజేసే ఇల్లు ఉన్నా.. కెరీర్ మొదట్లో ఉన్న ఇంటిపై మమకారం వదులుకోని స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ అద్దె కడుతున్న వైనం..

Radhe Shyam: కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో.

Thimmappur Car Accident: తిమ్మాపూర్‌ వాగులో కొట్టుకుపోయిన కారు గుర్తింపు.. రెండు మృతదేహాలు లభ్యం !