Thimmappur Car Accident: తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు గుర్తింపు.. రెండు మృతదేహాలు లభ్యం !
వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యం అయ్యినట్లు పోలీసులు తెలిపారు.
Vikarabad District Car Accident: వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యం అయ్యినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కురిసిన భారీవర్షాలకు జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. మోమిన్‌పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రవాహంలో కారు కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో రెండు డెడ్‌బాడీస్‌ను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఆదివారం తిమ్మాపూర్ వాగు ఉధృతికి కొట్టుకుపోయింది పెళ్లి బృందం కారు. వాగుకు కిలోమీటర్ దూరంలో కారును గుర్తించారు పోలీసులు. మూడ్రోజుల క్రితం పెళ్లైన కొత్త జంట..బంధువులతో కలిసి రావులపల్లి బయల్దేరింది. తిమ్మాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడం వాళ్లపాలిట శాపంగా మారింది. తిమ్మాపూర్ వాగు ప్రవాహానికి కారు కొట్టుకుపోయంది. పెళ్లికొడుకు నవాజ్ రెడ్డి, అతని సోదరి ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. కారుతో పాటు నలుగురు గల్లంతయ్యారు. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా.. వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు కాగా, గల్లంతైన వధువు ప్రవల్లిక, వరుడి అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, బాలుడు ఇషాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే, ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో భారీవర్షాలకు ఏడుగురు గల్లంతవగా.. ఒకరు మృతి చెందారు. భారీ వర్షాలతో జరిగిన ఘటనలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. వికారాబాద్ కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి సబిత. సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీని ఆదేశించారు. వరద ఉధృతిలో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు మంత్రి సబితా సూచించారు.
Shocking: పది వేలకు రెండు పాములు.. భార్య గదిలోకి వదిలి.. వీడియో చెప్పిన షాకింగ్ నిజాలు!