Hyderabad: కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటంచిందో అత్త.. కుమార్తె ఏం చేసిందంటే..?
హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటంచింది ఓ అత్త. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
Hyderabad Man set on Fire: హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటంచింది ఓ అత్త. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పొచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని (28) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలోని జేఎల్‌ఎన్‌ఎస్ నగర్‌లో నివసించే అనిత అలియాస్ సోని(26)తో 2015లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె హసిని కూడా ఉంది. మద్యానికి బానిస అయిన నాని తరుచుకు భార్యతో ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే తాగిన మైకంలో భార్యను వేధించేవాడు. అన్నిసార్లు సర్ధి చెప్పిన నాని బుద్ధి మార్చుకోలేదు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి సంసారాన్ని కుదుట పరిచారు.
అయితే, భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు అధికం అయ్యాయి. దీంతో తొమ్మిది నెలల క్రితం మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది సోని. అప్పటినుంచి తల్లితో కలిసి అడ్డగుట్టలో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ(45), కుమార్తెతో కలిసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.