IND vs ENG: నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీంలో రెండు మార్పులు.. వికెట్ కీపర్ ఔట్.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ భాగస్వామి

IND vs ENG: భారత్‌తో నాల్గవ టెస్ట్ కోసం తమ జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం టీంలో నుంచి ఇద్దరు ఆటగాళ్లు తప్పుకున్నారు. దీంతో ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం మరో ఇద్దరు ఆటగాళ్లకు చోటిచ్చారు.

IND vs ENG: నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీంలో రెండు మార్పులు.. వికెట్ కీపర్ ఔట్.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ భాగస్వామి
England Cricketers
Follow us
Venkata Chari

|

Updated on: Aug 30, 2021 | 9:42 AM

IND vs ENG: లీడ్స్ టెస్టులో భారత్‌ను ఓడించిన తరువాత కూడా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. లండన్‌లోని ది ఓవల్‌లో జరగనున్న సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులు చేసింది. లీడ్స్‌లో గెలిచిన ప్లేయింగ్ ఎలెవన్ కోసం మార్పులు చేయడం విశేషం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంగ్లండ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ నాల్గవ టెస్టు నుంచి విరామం తీసుకున్నాడు. మొదటి మూడు టెస్టుల్లో వికెట్ కీపింగ్ విధులు ఆడిన బట్లర్, తనకు రెండో బిడ్డ జన్మించినందున ఓవల్‌ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. జట్టు నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆయన ప్రత్యేక సందర్భం కోసం ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా బట్లర్‌కు సెలవలు ప్రకటించింది. బట్లర్ లేకపోవడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు మరోసారి జానీ బెయిర్‌స్టోపై పడనున్నాయి.

ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ, టెస్ట్ కోసం జట్టులో జరుగుతున్న మార్పుల గురించి తెలియజేశాడు. నాల్గవ టెస్ట్ నుంచి బట్లర్ దూరంగా ఉండటంపై వివరించాడు. అయితే, ఐదవదైన చివరి టెస్ట్ కోసం బట్లర్ తిరిగి రావడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులను బట్టి మాంచెస్టర్‌లో జరిగే మ్యాచ్ కోసం అతడిని జట్టులో చేర్చనున్నట్లు తెలిపాడు.

సామ్ బిల్లింగ్స్‌కు కూడా చోటు.. బట్లర్ లేనప్పుడు జానీ బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ బాధ్యతను స్వీకరిస్తాడని సిల్వర్‌వుడ్ పేర్కొన్నాడు. కీపింగ్ కోసం బెయిర్‌స్టోకు సామర్థ్యం ఉందని, దాన్ని ఆస్వాదించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు ఆయన తెలిపినట్లు పేర్కొన్నాడు. మరో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్‌ను రిజర్వ్ వికెట్ కీపర్‌గా జట్టులో చేర్చింది. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బిల్లింగ్స్ కూడా జట్టులో ఉన్నారు. కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.

మరోవైపు ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ నాల్గవ టెస్ట్ కోసం జట్టులో చేరాడు. మడమ గాయం కారణంగా అతను మొదటి, మూడో టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. కానీ, అతను ఇటీవలి స్వదేశంలో ఆడిన మ్యాచ్‌లలో తన ఫిట్‌నెస్‌తో పాటు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో తుది జట్టులో స్థానం సంపాదించాడు. అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ జట్టు నుంచి దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది.

నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు.. జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), రోరీ బర్న్స్, సామ్ కర్రాన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

Also Read:

భారత్‌లోనే పుట్టాడు.. కానీ, విదేశీ జట్టు కెప్టెన్‌‌గా ఎదిగాడు.. ప్రస్తుతం ఇండియాలో ఆడేందుకు సొంత జట్టునే వదిలిపెట్టాడు.. అతనెవరంటే?

ఐపీఎల్ ముందు గర్జించిన ముంబై బ్యాట్స్‌మెన్.. 10 బంతుల్లో 50 పరుగులు.. ఓమన్‌లో పరుగుల వరద

250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. కోల్‌కతా ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్.. అయినా తప్పని పరాజయం!

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!