భారత్‌లోనే పుట్టాడు.. కానీ, విదేశీ జట్టు కెప్టెన్‌‌గా ఎదిగాడు.. ప్రస్తుతం ఇండియాలో ఆడేందుకు సొంత జట్టునే వదిలిపెట్టాడు.. అతనెవరంటే?

ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన ఓ విదేశీ కెప్టెన్.. భారత్‌లోనే జన్మించాడు. ప్రస్తుతం బీసీసీఐ అనుమతితో భారత్‌లో ఆడాలని వచ్చాడు.

భారత్‌లోనే పుట్టాడు.. కానీ, విదేశీ జట్టు కెప్టెన్‌‌గా ఎదిగాడు.. ప్రస్తుతం ఇండియాలో ఆడేందుకు సొంత జట్టునే వదిలిపెట్టాడు.. అతనెవరంటే?
Anshuman Rath
Venkata Chari

|

Aug 30, 2021 | 9:15 AM

విదేశీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు త్వరలో భారతదేశంలో ఆడబోతున్నాడు. అతను భారతదేశ దేశీయ క్రికెట్‌లో ఒడిశా జట్టు కోసం ఫీల్డింగ్ చేయనున్నాడు. ఈ ఆటగాడి పేరు అన్షుమన్ రథ్. అతను హాంకాంగ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం భారతదేశ దేశవాళీ క్రికెట్ 2021-22 సీజన్‌లో ఒడిశా తరపున ఆడేందుకు. అతను బీసీసీఐ కింద దేశీయ ఆటగాడిగా ఆడటానికి ఒక సంవత్సరం కూలింగ్ ఆఫ్ పీరియడ్ పూర్తి చేశాడు. అతనెవరో కాదు.. 23 ఏళ్ల అన్షుమన్ రాత్.. ఈయన ఎడమ చేతి బ్యాట్స్‌మన్. అతను భారతదేశంలోనే జన్మించాడు. భారతీయ పాస్‌పోర్ట్ కూడా కలిగి ఉన్నాడు.

అన్షుమన్ హాంకాంగ్ కోసం 18 వన్డేలు, 20 టీ 20 లు ఆడాడు. వన్డేల్లో అతను 51.75 సగటుతో 828 పరుగులు సాధించాడు. అతని పేరుపై ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను టీ20లో 321 పరుగులు బాదేశాడు. కానీ, ఇంకా యాభై పరుగులు సాధించలేకపోయాడు. బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. వన్డేల్లో 14 వికెట్లు, టీ20 ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2018లో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో హాంకాంగ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ టైంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంక్ ఓడిపోయింది. కానీ, 2020 సంవత్సరంలో, హాంకాంగ్ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడకుండా పక్కకు తప్పుకుంది. దీంతో అన్షుమన్ రాథ్ హాంకాంగ్ జట్టు నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు.

అన్షుమన్ రాథ్ 14 సంవత్సరాల వయసులో హాంకాంగ్ వెళ్లాడు. అక్కడి నుంచి చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లాడు. ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు, అతను క్రికెట్‌లో కెరీర్ ప్రారభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇంగ్లండ్ ఇమ్మిగ్రేషన్ నియమాల కారణంగా, ఐసీసీ అసోసియేట్ దేశాల నుంచి ఆటగాళ్లు వృత్తిపరంగా ఆడటానికి అనుమతించడం వీలుకాలేదు. దీంతో అన్షుమన్ రాథ్ హాంకాంగ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

విదర్భ తరఫున ఆడేందుకు.. అన్షుమన్ విదర్భ జట్టు కోసం ఆడటానికి సిద్ధమవుతున్నాడు. కానీ, అక్కడ ఎలాంటి చర్చ జరగలేదు. కాబట్టి ఒడిషా కోసం ఆడటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతను ఒడిశాలోనే జన్మించాడు. ఈ కారణంగా అతను ఒడిషా రాష్ట్రం కోసం ఆడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అన్షుమన్ ఒడిశా రంజీ జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆపై ఐపీఎల్‌లో భారత ఆటగాడిగా ఆడాలని కోరుకుంటున్నాడు. అతను ప్రస్తుతం ఒడిషా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జట్టులో ఎంపిక కోసం పోటీ పడుతున్నాడు.

Also Read: ఐపీఎల్ ముందు గర్జించిన ముంబై బ్యాట్స్‌మెన్.. 10 బంతుల్లో 50 పరుగులు.. ఓమన్‌లో పరుగుల వరద

250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. కోల్‌కతా ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్.. అయినా తప్పని పరాజయం!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu