ఐపీఎల్ ముందు గర్జించిన ముంబై బ్యాట్స్‌మెన్.. 10 బంతుల్లో 50 పరుగులు.. ఓమన్‌లో పరుగుల వరద

ఓమన్‌లో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ముంబై తరపున బరిలోకి దిగాడు. కానీ, ఐపీఎల్ 2021లో మాత్రం రాజస్థాన్ రాయల్స్‌ తరపున బరిలోకి దిగనున్నాడు.

ఐపీఎల్ ముందు గర్జించిన ముంబై బ్యాట్స్‌మెన్.. 10 బంతుల్లో 50 పరుగులు.. ఓమన్‌లో పరుగుల వరద
Yashasvi Jaiswal
Follow us

|

Updated on: Aug 30, 2021 | 9:06 AM

Mumbai Team: వచ్చే నెలలో యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 రెండవ భాగం కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. చాలా మంది ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలతో యూఏఈకి చేరుకున్నారు. కొంతమంది త్వరలో యూఏఈకి బయల్దేరనున్నారు. అదే సమయంలో, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు కూడా సిద్ధమవుతున్నారు. యూఏఈకి కొద్ది దూరంలో ఒమన్‌లో తమ బ్యాట్‌ను ఝలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో, భారతదేశ దేశీయ క్రికెట్ దిగ్గజం ముంబై (ముంబై క్రికెట్ టీమ్) టీ 20, వన్డే సిరీస్ కోసం ఒమన్ చేరుకుంది. ముంబై జట్టు ఒమన్ జాతీయ జట్టుతో ఓ మ్యాచ్ ఆడింది. ఆదివారం జరిగిన ఈ పర్యటనలో తొలి వన్డేలో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఇందులో ముంబై కెప్టెన్ శామ్స్ ములాని, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నారు.

ఒకటిన్నర నెలల తర్వాత ఒమన్‌లో టీ 20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల కోసం, మైదానంలో సన్నాహాకాలను సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగానే ముంబైని ఒమన్‌కు ఆహ్వానించారు. రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌కు ఒమన్ పేరు పెట్టారు. వన్డే సిరీస్ ఆగస్టు 29న ఆదివారం ప్రారంభమైంది. ఇందులో ముంబై గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యశస్వి ఈ విజయానికి స్టార్‌గా మారాడు.

ఒమన్‌ను ఓడించారు.. ఈ మ్యాచ్ ముంబైకి బౌలింగ్, బ్యాటింగ్ పరంగా చాలా మంచి ప్రాక్టీస్ లభించింది. ఒమన్ మొదట బ్యాటింగ్ చేసింది. కానీ, ముంబై బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతో పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఒమన్ తరఫున ఖలీద్ కైల్ 76 పరుగులు, కెప్టెన్ కన్వర్ అలీ 52 పరుగులు సాధించారు. కానీ అతని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు అంతగా రాణించకపోవడంతో.. ఆజట్టు 47.1 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై తరఫున కెప్టెన్ శామ్స్ ములాని 3 వికెట్లు తీయగా, శశాంక్ అత్తార్డే, అమన్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.

యశస్వి ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వరద.. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరభించిన ముంబై.. ఆదిలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. కానీ, ఓపెనర్ యశస్వి ఓమన్ బౌలర్లపై ఆధిక్యాన్ని చూపించాడు. 79 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ముంబై జట్టును గెలిపించాడు. 27 వ ఓవర్లో ఔట్ అయ్యే ముందు యశస్వి 5 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ తామోర్ 4 ఫోర్ల సాయంతో అజేయంగా 51 పరుగులు చేసి 43.4 ఓవర్లలో జట్టుకు విజయాన్ని అందించాడు.

Also Read:

250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. కోల్‌కతా ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్.. అయినా తప్పని పరాజయం!

Megastar Chiranjeevi: చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..

India vs England: టీమిండియా స్టార్ క్రికెటర్లపై సెటైర్లు వేసిన ప్రముఖ యాంకర్.. నెట్టింట్లో చర్చనీయంశంగా మారిన ఇన్‌స్టా స్టోరీ