AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Dies: పాల వ్యాపారి దాష్టీకం.. యువకుడిని తాళ్లతో ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు..

మనుషుల్లో మానవత్వం మంటకలుస్తోంది. కనికరం లేకుండా కసాయిల్లా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Man Dies: పాల వ్యాపారి దాష్టీకం.. యువకుడిని తాళ్లతో ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన కిరాతకుడు..
Man Dies After Thrashes Ties Him To Truck And Drags
Balaraju Goud
|

Updated on: Aug 30, 2021 | 12:04 PM

Share

Man Dies After Thrashes Ties: రాను రాను మనుషుల్లో మానవత్వం మంటకలుస్తోంది. కనికరం లేకుండా కసాయిల్లా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నీమచ్‌ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ తతంగం బయటపడింది.

నీమచ్ జిల్లాలోని సింగోలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్‌ భీల్‌(40) సింగోలీ- నీమచ్‌ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్‌ మాల్‌ గుర్జార్‌ అనే పాల వ్యాపారి ద్విచక్రవాహనంపై వచ్చి భీల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం ఒలికిపోయాయి. పాలు నేలపాలయ్యాయనే కోపంతో భీల్‌పై గుర్జార్‌ దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. తీవ్రంగా కొట్టించాడు. అందరు కలిసి భీల్‌ కాళ్లకు తాడుతో బంధించి.. ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించి స్థానికులు వీడియోలు చిత్రీకరించి.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని బంధ విముక్తి చేసింది ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే.. యువకుడిపై దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ భీల్‌ మృతి చెందాడు. ఈ దారుణానికి పాల్పడ్డ మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్‌ కుమార్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also… AP CM Jagan: రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. రిపేర్ చేయించండని సీఎం జగన్‌కు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు

అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన టీమిండియా ఆల్‌రౌండర్.. 2014లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.. అతనెవరో తెలుసా!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ