AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు కోట్లువిలువజేసే ఇల్లు ఉన్నా.. కెరీర్ మొదట్లో ఉన్న ఇంటిపై మమకారం వదులుకోని స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ అద్దె కడుతున్న వైనం..

Tollywood Star Director: ఇప్పుడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిత్ర పరిశ్రమకు చెందినవారు.. కెరీర్ మొదట్లో రూపాయి సంపాదించడానికి కూడా అష్టకష్టాలు పడినవారు ఎందరో ఉన్నారు. సినిమాల మీద..

ఇప్పుడు కోట్లువిలువజేసే ఇల్లు ఉన్నా.. కెరీర్ మొదట్లో ఉన్న ఇంటిపై మమకారం వదులుకోని స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ అద్దె కడుతున్న వైనం..
Director
Surya Kala
|

Updated on: Aug 30, 2021 | 11:10 AM

Share

Tollywood Star Director: ఇప్పుడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిత్ర పరిశ్రమకు చెందినవారు.. కెరీర్ మొదట్లో రూపాయి సంపాదించడానికి కూడా అష్టకష్టాలు పడినవారు ఎందరో ఉన్నారు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో తమని తాము నిరూపించుకోవడానికి భాగ్యనగరం బాటపట్టి.. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన వారు ఎందరో.. కెరీర్ మొదట్లో కష్టపడిన వ్యక్తుల్లో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం మనసుని హత్తుకునే మాటలతో తెలుగుచలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నారు మౌనముని. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ… సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. సినిమాల్లోకి రావడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పడిన కష్ఠాలు ఒక్క సునీల్ కు మాత్రమే తెలుసు. సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ సినిమాలలోకి రాకముందు ఒకే రూమ్ లో కలిసి ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. అయితే వీరిద్దరితో పాటు దర్శకుడు దశరథ్ కూడా వీరి రూమ్ లోనే ఉండేవారు.

Trivikram Srinivas

Trivikram Srinivas

ఈ విధంగా పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి నుంచి త్రివిక్రమ్, సునీల్, దశరథ్ సినిమా ప్రయాణాలను కొనసాగించారు. మాటల రచయితగా, దర్శకుడుగా త్రివిక్రమ్, కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్, దర్శకుడిగా దశరథ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తనకు మొదటి ఆశ్రయం ఇచ్చిన ఆ రూమ్ అంటే త్రివిక్రమ్ కు మంచి అభిమానం అట. ఇప్పటికీ సెంటిమెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఇంటిని తన వద్దనే ఉంచుకుని రూమ్ కు రెంట్ కడుతూనే ఉన్నారట. ఆ రూంతో ఉన్న జ్ఞాపకాలను వదులుకోలేక ఇప్పటికీ ఆ ఇంటికి ప్రతినెల ఐదువేల రూపాయలను అద్దె చెల్లిస్తున్నారు. ఆ రూమ్ లో కూర్చునే త్రివిక్రమ్ తన సినిమాకు కథలు, మాటలు రాస్తారట. ఆ రూమ్ ని సెంటిమెంట్ గా త్రివిక్రమ్ ఫీల్ అవుతారని.. కోట్లు ఖరీదు చేసే ఇల్లు ఆఫీసు ఉన్నా పాత రూమ్ లో ఉండడానికి ఇష్టపడతారని సన్నిహితులు అంటారు.

Also Read: Actor Suman: దక్షిణాది సీనియర్ నటుడు యాక్షన్ స్టార్ సుమన్ పుట్టిన రోజు నేడు..