AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana Benefits: మఖానాతో గుండె, ముత్రపిండాల సమస్యలకు చెక్..! పరగడుపున తింటే 5 అద్భుత ప్రయోజనాలు..

Makhana Benefits: మఖానా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దీనిని డ్రై ఫ్రూట్స్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది.

Makhana Benefits: మఖానాతో గుండె, ముత్రపిండాల సమస్యలకు చెక్..! పరగడుపున తింటే 5 అద్భుత ప్రయోజనాలు..
Makhana
uppula Raju
|

Updated on: Aug 30, 2021 | 6:33 PM

Share

Makhana Benefits: మఖానా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది దీనిని డ్రై ఫ్రూట్స్‌గా భావిస్తారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది. ప్రజలు దీనిని నెయ్యిలో వేయించి, ఖీర్ తయారు చేసి, స్వీట్లలో డ్రై ఫ్రూట్స్‌గా కలుపుకొని తింటున్నారు. కొందరు వ్యక్తులు కూరగాయలలో కలుపుకొని తింటున్నారు. మఖానా రుచి చల్లగా ఉంటుంది కానీ ఇది చలికాలం, వేసవి కాలం రెండు కాలాలలోను తింటారు. ఇందులో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటుంది. అయితే మెగ్నీషియం, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాకుండా మఖానా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో 4 నుంచి 5 మఖానాలు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని మఖానా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. చక్కెరను నియంత్రిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మఖానా చాలా మంచి చిరుతిండి. డయాబెటిక్ రోగులు రోజూ ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా 4 నుంచి 5 మఖానాలు తింటే వారి షుగర్ అదుపులో ఉంటుంది.

2. గుండెకు ప్రయోజనకరం మీకు గుండె సంబంధిత వ్యాధి ఉంటే మీరు తప్పనిసరిగా మఖానా తినాలని వైద్యులు చెబుతారు. మఖాన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బిపిని నియంత్రిస్తుంది. కానీ మీకు అధిక బిపి సమస్య ఉంటే ఉప్పుతో కలిపి తీసుకోకండి.

3. గర్భిణీ స్త్రీ, శిశువుకు ఆరోగ్యకరమైనది గర్భిణీ స్త్రీ మఖాన ఖీర్ తినాలి. ఇది తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బిడ్డకు పోషణనిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది.

4. మూత్రపిండాలు ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ప్రజలలో మూత్రపిండ సమస్యలు వస్తున్నాయి. కానీ మీరు మఖానను క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు ఈ సమస్యను నివారించవచ్చు. మఖానా తినడం ద్వారా విషపూరిత పదార్థాలు మూత్రపిండాల నుంచి బయటకు వెళ్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి.

5. బరువు తగ్గుతుంది బరువు తగ్గాలనుకునే వ్యక్తులు మఖానా తినాలి. పగటిపూట ఆకలి అనిపించినప్పుడు మఖానా తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అంతేకాదు మీరు అతిగా తినడం కూడా మానేస్తారు.

Vastu Rules: అద్దం గురించి అసలు నిజాలు తెలుసుకోండి..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..

పండగొస్తే పెను ప్రమాదం.. టెర్రర్ సృష్టిస్తున్న డెల్టా వైరల్ వ్యాప్తి..: Delta Corona Effect Live Video.

INDW vs AUSW: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా మహిళల జట్టు.. విమానంలో సందడే సందడి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా