Milk With Anjeer Figs: రాత్రి పడుకునే ముందు పాలు, అంజీర్ కలిపి తీసుకోవచ్చా ? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

ప్రస్తుతం పరిస్థితుల్లో ఆరోగ్యం పై శ్రద్ద చాలా అవసరం. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించే

Milk With Anjeer Figs: రాత్రి పడుకునే ముందు పాలు, అంజీర్ కలిపి తీసుకోవచ్చా ? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Anjeer With Milk
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2021 | 7:12 PM

ప్రస్తుతం పరిస్థితుల్లో ఆరోగ్యం పై శ్రద్ద చాలా అవసరం. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించే ఆహారం తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల చాలా మంది రక్తపోటు, బరువు పెరగడం, కడుపు నొప్పి, నిద్రలేమి, అలసట వంటి అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి చాలారకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు అనారోగ్య సమస్యలకు చెక్ పట్టడానికి రాత్రిళ్లు పడుకునే ముందు పాలతోపాటు అంజీర్ పండ్లను తీసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు ఇలా తీసుకోవడం మంచిదే.. వాటి వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందామా.

అంజీర్ పండ్లలో విటమిన్ ఎ, సీ, ఇ, కె, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, కాపర్ అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అటు పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటి వలన ఎముకలు బలంగా ఉంటాయి. అయితే పాలతోపాటు అంజీర్ పండ్లను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో 2 అంజీర్ పండ్లు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండడంతోపాటు.. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది

ఎలా తీసుకోవాలంటే.. ఒక గ్లాసు పాలలో 2-3 అత్తి పండ్లను (అంజీర్) వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఒకవేళ పాలలో మరిగించకూడదనుకుంటే 2-3 ఎండిన అత్తి పండ్లను గోరువెచ్చని పాలతో విడిగా కూడా తినవచ్చు.

ప్రయోజనాలు.. * హర్మోన్ల అసమతుల్యత.. ప్రస్తుతం కాలంలో చాలా మందికి శరీరంలోని హార్మోన్లు స్థాయిలో మార్పులు సంభవిస్తున్నాయి. గుండె వేగం, రక్తపోటు, బరువు పెరగడం, కడుపు సమస్యలు, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి నిద్రపోయే ముందు పాలు, అంజీర్ పండ్లను తీసుకోవాలి.

* పీరియడ్స్ సమస్యలు.. పీరియడ్స్ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు పాలతోపాటు అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే.. బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు, పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* జీర్ణక్రియ.. జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉంటే అంజీర్ పండ్లు, పాలు కలిపి తీసుకోవచ్చు. ఇది కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు, అసిడిటీ, ఇతర సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

* రక్తపోటు నియంత్రణ.. రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతిరోజూ పాలు, అంజీర్ పండ్లు కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే.. కొద్ది రోజుల్లోనే రక్తంలో షుగర్ లెవల్స్ నార్మల్ అవుతాయి. ఎండిన అంజీర్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే బాడీలో వాటర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

* సంతానోత్పత్తి పెరుగుతుంది… పాలు, అంజీర్ పండ్లలో జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

* బలం.. వ్యాయామం తర్వాత బాగా అలసటగా అనిపిస్తే అంజీర్, పాలు తీసుకోవాలి. ఇది మీకు మరింత శక్తిని ఇస్తుంది.

* గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది… గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పాలు, అంజీర్ పండ్లు ఎక్కువగా సహాయపడతాయి. ఇది గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

* చర్మం.. అంజీర్ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే చర్మానికి మాయిశ్చరైజర్‏గా పనిచేస్తుంది.

*ఎముకలు దృఢంగా.. అంజీర్ పండ్లు, పాలు రెండింటిలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా ఉంటాయి.

Also Read: Ganji: అయ్యో..! అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? పెద్ద తప్పే చేస్తున్నారు.

Fit India App: మీ ఫిట్‌నెస్‌కు యాప్ భరోసా.. ఫిట్ ఇండియా కోసం మీరు సిద్ధమా? అయితే ఈ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి!