Hallmarking: హాల్‌ మార్కింగ్‌ విధానంలో నగల వ్యాపారులకు ఉపశమనం కలుగనుందా..? మూడు నెలల గడువు పొడిగించే అవకాశం

Hallmarking: బంగారు అభరణాలపై హాల్‌మార్క్‌ స్వచ్చతకు నిదర్శనం. ఆగస్టు 31 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం...

Hallmarking: హాల్‌ మార్కింగ్‌ విధానంలో నగల వ్యాపారులకు ఉపశమనం కలుగనుందా..? మూడు నెలల గడువు పొడిగించే అవకాశం
Follow us
Subhash Goud

|

Updated on: Aug 30, 2021 | 1:51 PM

Hallmarking: బంగారు అభరణాలపై హాల్‌మార్క్‌ స్వచ్చతకు నిదర్శనం. ఆగస్టు 31 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. హాల్‌మార్కింగ్‌ లేని అభరణాలు అమ్మితే కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం హాల్‌ మార్కింగ్‌ విధానం విధించడంతో స్వర్ణకారులు సమ్మెకు దిగారు. అయితే పాత నగల హాల్‌ మార్కింగ్‌ నిబంధనలలో ప్రభుత్వం మరోసారి ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

హాల్‌మార్కింగ్‌ విధానంపై మూడు నెలల పాటు గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఈ హాల్‌మార్కింగ్‌ విధానం నవంబర్‌ వరకు ఉండే అవకాశం ఉంది. స్వర్ణకారులు, వ్యాపారవేత్తలు సమ్మెకు దిగడంతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వర్ణకారులతో సమావేశం అయ్యారు. హాల్‌మార్కింగ్‌పై, స్వర్ణకారుల సమస్యలపై చర్చించారు. దీంతో ఒక లీగర్‌ కమిటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటి వ్యాపారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. హాల్‌ మార్కింగ్‌ విధానంపై పరిశీలించనుంది. భారతీయ స్టాండర్డ్స్‌ ప్రభుత్వ బ్యూరో (BIS) జూన్‌ 16 నుంచి ఆగస్టు 31 వరకు పాత స్టాక్‌కు హాల్‌ మార్క్‌ చేయడానికి అనుమతి ఇచ్చింది. నగల వ్యాపారులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. హాల్‌మార్కింగ్‌ గడువు కూడా రేపటితో ముగియనుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్వర్ణకారుల్లో ఆసక్తికరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ హాల్‌ మార్కింగ్‌ విధానంపై దేశ వ్యాప్తంగా సుమారు 350 స్వర్ణకారుల సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ విధానం బంగారు స్వచ్చతకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. హాల్‌ మార్కింగ్‌ విధానం సజావుగా అమలు చేయాడానికి నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఈ అభరణాలు, వాటాదారుల సమస్యలను పరిష్కరించడానికి కమిటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బంగారంపై తీసుకువచ్చిన హాల్‌ మార్కింగ్‌ విధానం వినియోగదారులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. జూన్‌ 16 నుంచి దశల వారీగా బంగారంపై హాల్‌మార్కింగ్‌ అమలు చేస్తున్నామనేది ప్రభుత్వ వాదన.

హాల్‌మార్కింగ్‌ అంటే ఏమిటి..?

మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్‌ నగలను ఎలా గుర్తించాలో తెలియదు. చాలా మందికి ఒరిజినల్‌, నకిలీవి అనేవి తెలియవు. కొందరు చూడాగానే గుర్తిస్తారు. బంగారం నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్‌ ఉపయోగపడుతుంది. నగల షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్‌ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలి. హాల్‌మార్కింగ్‌ లేని నగలు అమ్మడానికి వీలులేదు. అలా అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్‌ లేని నగలు కూడా లభిస్తున్నాయి.

అయితే మీరు ఇప్పటికే నగలు కొన్నట్లయితే స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్‌ అండ్‌ హాల్‌మార్కింగ్‌ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్‌ మార్క్‌ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి:

SBI Offer: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్‌ ఆగస్టు 31తో ముగియనుంది..!

Bumper Offer: వెరైటీ బంపర్‌ ఆఫర్‌.. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకే నెల జీతం బోనస్‌.. ఎక్కడో తెలుసా..?