MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!

దీపావళి అంటే వెలుగుల పండగ అని అర్థం. కమ్ముకున్న చీకట్లను పోగొట్టి కాంతిని పంచే సుదినం. ప్రతి ఇంటి ముందు బారులు దీరిన దీపాలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి. మన దేశంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుపుకొంటారు. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తారు. వారికి బహుమతులు అందజేసి సంతోష పడతారు. కొత్త దుస్తులు ధరించి సంబరాలు చేసుకుంటారు.

MF portfolio: ఈ సింపుల్ చిట్కాతో లక్ష్మీ కటాక్షమే..స్టాక్ మార్కెట్‌లో అనుసరించాల్సిన వ్యూహమిదే..!
Mutual Fund
Follow us
Srinu

|

Updated on: Nov 01, 2024 | 3:00 PM

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజ అత్యంత ప్రధానమైంది. ఎంతో భక్తిశ్రద్దలతో ఈ పూజ నిర్వహించాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పూజ చేసేటప్పుడు వివిధ వస్తువులు ఎలా ఉపయోగపడతాయో, స్టాక్ మార్కెట్ లో రాబడి పెరగడానికి మీ పెట్టుబడి పోర్ట్ పోలియో కీలకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మీ పెట్టుబడి పోర్ట్ పోలియో సక్రమంగా ఉన్నప్పుడే దీర్ఘకాలంలో రాబడి బాగా పెరుగుతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న పెట్టుబడుల సమాహారాన్నే పోర్ట్ పోలియో అంటారు. దీనిలో స్టాక్ లు, బాండ్లు, నగదు, రియల్ ఎస్టేట్ తదితర విభిన్న ఆస్తులు ఉంటాయి. ఒకే దానిపై ఇన్వెస్ట్ చేయకుండా అన్నింటిపై సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒక దానిలో నష్టమొచ్చినా, మరో దానిలో లాభపడే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పోర్ట్ పోలియో అనేది ప్రతి పెట్టుబడిదారుడికీ అది కీలకం. పూజ చేసేటప్పుడు వివిధ వస్తువులు ఎలా ఉపయోగపడతాయో, సంపదను పెంచడానికి మీ పోర్ట్ పోలియోలోని విభిన్న ఎంపికలు అవసరమవుతాయి.

ఈక్విటీ

పూజ చేసేటప్పుడు దీపం అత్యంత కీలకం. చీకటిని పారద్రోలడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రకాశవంతమైన వెలుగును అందిస్తుంది. అలాగే సంపదను పెంచేందుకు అవసరమైన వాటిలో ఈక్విటీ పెట్టుబడులు దీపంలా ఉపయోగతాయి. గదికి వెలుగును అందించే దీపంలా.. మీ సంపద పెరిగేందుకు మార్గం చూపుతాయి.. ఈక్విటీలు ఎల్లప్పుడూ సానుకూల రాబడిని అందిస్తాయి.

బాండ్లు

పూజ చేసేందుకు అత్యంత అవసరమైనవి పువ్వులు. వీటిని అలంకరించడం వల్ల విగ్రహానికి ఎంతో అందం వస్తుంది. మనసుకు ఉత్సహం కలిగించడంతో పాటు సువాసనలు వెదజల్లుతాయి. ఇదే మాదిరిగా మీ పోర్టు పోలియోలో బాండ్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉపయోగపడతాయి. మీ సంపద పెరిగేందుకు ఎంతో దోహదపడతాయి. లక్ష్మీపూజలో పువ్వుల మాదిరిగా మీ పెట్టుబడులకు అందాన్ని, రాబడిని అందజేస్తాయి.

ఇవి కూడా చదవండి

బంగారం

పూజలో మరో అత్యంత ముఖ్యమైన వస్తువు తిలకం. దీన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. పూజ సమయంలో అందరూ తమ నుదుటపై తిలకం ధరిస్తారు. ఇలా చేయడం వల్ల మీ పూజకు పరిపూర్ణత కలుగుతుంది. ఇదే మాదిరిగా మీ సంపదకు బంగారంపై పెట్టుబడి రక్షణగా ఉంటుంది. అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని పేర్కొంటారు. కాబట్టి మీ పోర్ట్ పోలియోలో బంగారంపై పెట్టుబడులు తప్పనిసరిగా ఉండాలి.

ట్రెజరీ బిల్లులు

పూజా సమయంలో నాణేలు గానీ డబ్బును గానీ లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఉంచుతారు. పూజ చేసే సమయంలో ఇది చాలా అవసరం. తద్వారా సంపద పెరుగుతుందని భావిస్తారు. అలాగే మీ పెట్టుబడి పోర్ట్ పోలియోలో ట్రెప్స్ (ట్రెజరీ బిల్లుల తిరిగి కొనుగోలు ఒప్పందాలు) చాలా అవసరం. పూజ సమయంలో సమర్పించే నాణేల మాదిరిగా మీ పోర్ట్ పోలియో కు సంపూర్ణతను అందిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి