Kia India sells: కియా ఇండియా, సోనెట్‌ దూకుడు.. కార్ల విక్రయాల్లో రికార్డ్‌.. తాజా గణాంకాలు విడుదల

Kia India sells: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ కంపెనీ కియా ఇండియా తన విక్రయాల్లో దూసుకుపోతోంది. కంపెనీ బుధవారం మే 2022 నెలలో తన విక్రయాల గణాంకాలను విడుదల..

Kia India sells: కియా ఇండియా, సోనెట్‌ దూకుడు.. కార్ల విక్రయాల్లో రికార్డ్‌.. తాజా గణాంకాలు విడుదల
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2022 | 6:11 PM

Kia India sells: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ కంపెనీ కియా ఇండియా తన విక్రయాల్లో దూసుకుపోతోంది. కంపెనీ బుధవారం మే 2022 నెలలో తన విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. 2022 మే నెలలో 18,718 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఇక ఏప్రిల్‌ నెలలో 19,019 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 1.5 శాతం తగ్గిందనే చెప్పాలి. ఈ విక్రయాల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా సోనెట్‌ నిలిచింది. 7,899 యూనిట్లను, సెల్టోస్‌ 5,953, కేరెన్స్‌ 4,612, కార్నివాల్‌ 239 యూనిట్లు విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అయితే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో 15 Fully -EV కార్లను విడుదల చేయనుంది. యూరోపియన్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన Fully -EV, కియా ఈవీ6 మోడల్‌ను పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రీబుకింగ్స్‌ మే 26 నుంచి ఇండియాలో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే.

దేశంలోని మొదటి ఐదు కార్ల తయారీ సంస్థలలో కియా ఇండియా తన స్థానాన్ని నిలుపుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఇది 4.5 లక్షల దేశీయ విక్రయాల మైలురాయిని అధిగమించగా, సోనెట్ ప్రారంభమైనప్పటి నుండి 1.5 లక్షల అమ్మకాలను సాధించింది. అనేక సవాళ్ల మధ్య అమ్మకాలు జోరుగా సాగడం ఎంతో సంతోషంగా ఉందని కియా ఇండియా వైస్‌ ప్రసిడెంట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ బ్రారా తెలిపారు. రికార్డు టైంలో 4.5 లక్షల అమ్మకాలను సాధించినట్లు తెలిపారు. కియా బ్రాండ్‌పై ఇండియా కస్టమర్ల విశ్వాసాన్ని తెలియజేస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి