Ambassador 2.0: కొత్త అవతార్‌లో అంబాసిడర్..అద్భుత ఫీచర్స్, అదిరిపోయే కొత్త లుక్స్‌తో హల్‌చల్..
70వ దశకంలో భారత మార్కెట్‌ను ఏలిన అంబాసిడర్‌గా ఉన్న హిందుస్థాన్ మోటార్స్ 70% కంటే ఎక్కువ భారతీయ ఆటో మార్కెట్‌ను ఆక్రమించింది. అంబాసిడర్ కారు పొందిన ప్రజాదరణ, మన్నిక
అంబాసిడర్ కార్ల తయారీ సంస్థ హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు అంబాసిడర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోంది. భారతదేశంలోని ఎలక్ట్రిక్‌లో జాయింట్ వెంచర్ ద్వారా అంబాసిడర్‌ను మళ్లీ ప్రారంభించనుంది. ఇందుకోసం హిందుస్తాన్ మోటార్స్ ఫ్రెంచ్ కార్ మేకర్ పుజో(peugeot)తో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు.
70వ దశకంలో భారత మార్కెట్‌ను ఏలిన అంబాసిడర్‌గా ఉన్న హిందుస్థాన్ మోటార్స్ 70% కంటే ఎక్కువ భారతీయ ఆటో మార్కెట్‌ను ఆక్రమించింది. అంబాసిడర్ కారు పొందిన ప్రజాదరణ, మన్నిక కలిగిన కారుగా మంచి గుర్తింపు పొందింది.. ఆ సమయంలో ప్రధాని నుండి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ అంబాసిడర్‌నే వాడేవారు. చాలా సంవత్సరాలుగా మార్కెట్‌ను ఏలిన హిందుస్థాన్ మోటార్స్ నిరంతరం నష్టాలను చవిచూస్తున్నందున ఈ కార్ల తయారీ 2014లో నిలిపివేయబడింది. అందుకోసం కంపెనీ అంబాసిడర్ పేరును, దాని హక్కులను (అంబాసిడర్ నేమ్ అండ్ రైట్స్) ప్యూజో అనే కంపెనీకి రూ.80 కోట్లకు విక్రయించింది. ఇక ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్య ప్రక్రియ మరో 3 నెలల్లో జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ మొదట ఎలక్ట్రిక్ టూవీలర్స్ వాహనాలపై పని చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే భారత మార్కెట్లో లెజెండరీ కార్ అంబాసిడర్‌ను చూస్తాము. ఈ కారు హిందుస్థాన్ మోటార్స్ చెన్నై తయారీ ప్లాంట్‌లో మాత్రమే తయారు చేయబడుతుంది.
ఇక ఇప్పుడు కొత్త అవతార్‌లో అంబాసిడర్ ఆవిష్కరించనుంది. మీడియా నివేదికల ప్రకారం, ఇది ఎలక్ట్రిక్ సెడాన్ కారుగా ఉంటుంది. దీని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కంపెనీ గతంలో జరిగిన మిస్టెక్స్‌ని తిరిగి రిపీట్ కాకుండా చూసుకుంటోంది. దీని డిజైన్ అద్భుతంగా ఉండి, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ని సృష్టించగలదంటున్నారు. మిత్సుబిషి కార్లు ఉత్తరపర ప్లాంట్‌లోని అంబాసిడర్ హిందుస్థాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్‌లో తయారు చేయబడ్డాయి. అదే సమయంలో, కంపెనీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపరాలో అంబాసిడర్ కార్లను తయారు చేసేది. ఇప్పుడు తాజాగా మరోమారు చెన్నైలో తన సొంత కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌లో అంబాసిడర్ కారు మెకానికల్, డిజైన్ వర్క్‌తో పాటు అడ్వాన్స్‌గా స్టేజ్‌తో కొత్త ఇంజిన్‌ను తయారు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
అంబాసిడర్ కారు చివరిసారిగా 2014లో ఉత్తర్‌పరాలో తయారు చేయబడింది. ఆ తర్వాత అమ్మకాలు క్షీణించడంతో కంపెనీ నిరంతరం నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుల పాలవడంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.