Hyundai Reveals Venue: హ్యుందాయ్‌ నుంచి మరో అద్భుతమైన కారు.. ఎప్పుడు విడుదల అంటే..

Hyundai Reveals Venue: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. 2022 న్యూ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 16న మార్కెట్లో విడుదల చేయనుంది కంపెనీ ..

Hyundai Reveals Venue: హ్యుందాయ్‌ నుంచి మరో అద్భుతమైన కారు.. ఎప్పుడు విడుదల అంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2022 | 5:05 PM

Hyundai Reveals Venue: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. 2022 న్యూ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 16న మార్కెట్లో విడుదల చేయనుంది కంపెనీ తెలిపింది. ఫ్రంట్‌, రియ‌ర్ సైడ్ రీడిజైన్ లుక్‌తో, ఇంటీరియ‌ర్స్ మైన‌ర్ అప్‌గ్రేడ్స్‌తో న్యూ హ్యుందాయ్ వెన్యూ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. అయితే హ్యుందాయ్ క్రెటా ఇన్‌స్పిరేష‌న్‌తో న్యూ వెన్యూను డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు కంపెనీ వెల్లడించింది. యూనిక్ డిజైన్‌తో ఆల్ న్యూ గ్రిల్‌తో లేటెస్ట్ వాహనం కస్టమర్లను మరింతగా ఆకట్టుకోనుంది.

స్టైలిష్‌ లుక్‌..

కాగా, ఈ వాహనం స్టైలిష్‌ లుక్‌లో ఉండనుందని కంపెనీ తెలిపింది. డీఆర్ఎల్‌ల‌తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో న్యూ హ్యుందాయ్ వెన్యూ వినూత్న లుక్‌తో కస్టమర్లను మరింతగా ఆకర్షించనుంనది తెలిపింది. అయితే ఈ వాహనం అలాయ్ వీల్స్‌తో రానుంది. ఇక హ్యుందాయ్ వెన్యూ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే కియా సొనెట్‌, టాటా నెక్సాన్‌, అప్‌క‌మింగ్ 2022 మారుతి సుజుకి విటారా బ్రెజా వంటి వాహనాలకు పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. బ్లాక్‌బ‌స్టర్ ప్రోడ‌క్ట్స్‌ను ప్రవేశ‌పెట్టడం ద్వారా భార‌త్‌లో నూత‌న బెంచ్‌మార్క్‌ల‌ను హ్యుందాయ్ నెల‌కొల్పింద‌ని, న్యూ వెన్యూ క‌స్టమ‌ర్లను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ ఉన్‌సూ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి