Airtel Plans: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి మూడు సరికొత్త ప్లాన్స్‌.. పూర్తి వివరాలు..!

Airtel Plans: టెలికం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్‌ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు పోటా పోటీగా దూసుకుపోతున్నాయి..

Airtel Plans: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి మూడు సరికొత్త ప్లాన్స్‌.. పూర్తి వివరాలు..!
Follow us

|

Updated on: May 31, 2022 | 9:48 PM

Airtel Plans: టెలికం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్‌ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు పోటా పోటీగా దూసుకుపోతున్నాయి. నెలనెలా కస్టమర్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో డేటా తప్పనిసరి అయిపోయింది. ఇంటర్నెట్‌ లేనిది ఉండటం లేదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంటర్నెట్‌ లేనిది ఉండటం లేదు. ఈ కారణంగా ప్రతి ఒక్కరికి డేటా వినియోగం పెరిగిపోతోంది. ఇక తాజాగా ఎయిర్‌టెల్‌ నుంచి ఒకేసారి మూడు కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 17 ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్స్‌తో పాటు డీటీహెచ్‌ కనెక్షన్‌ కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక రిలేషన్‌షిప్‌ మేనేజర్‌తో యూజర్లకు ఎయిర్‌ బ్లాక్‌ ప్రియారిటీ కేర్‌ను కూడా అందిస్తోంది ఎయిర్‌టెల్‌. అయితే వీటి ధరలు వరుసగా రూ. 1,599, రూ. 1,099 రూ. 699 ఉన్నాయి.

రూ.1599 ప్లాన్‌:

ఈ ప్లాన్‌ తీసుకుంటే నెలకు 3.3 టీబీ డేటా 300 ఎంబీపీఎస్‌ వేగంతో వస్తుంది. ఇందులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం ప్రీమియం సింగిల్ లాగిన్‌తో ఒకేసారి 14 ఓటీటీలకు యాక్సెస్‌ ఇచ్చే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి

రూ.1,099 ప్లాన్‌:

ఈ ప్లాన్‌లో నెలకు 3.3 టీబీ డేటా 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌ తప్ప మిగతా OTT ఫ్లాట్‌ఫామ్స్‌ అన్నింటినీ వీక్షించే వెలుసుబాటు ఉంటుంది.

రూ.699 ప్లాన్‌:

ఈ ప్లాన్‌లో నెలకు 3.3 టీబీ డేటా 40 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్ తప్ప మిగతా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ అన్నీ ఈ ప్లాన్‌లో వస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో మాత్రం కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.