PM Kisan: అన్నదాతలకి అలర్ట్.. ఈ కేవైసీ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడగింపు..!
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మంగళవారం(మే 31) దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం బహుమతిని అందించింది.
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మంగళవారం(మే 31) దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం బహుమతిని అందించింది. 11వ విడత మొత్తాన్ని దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది . ఇందులో భాగంగా బీహార్‌లోని 82 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారు. కానీ ఇందులో కొందరి అకౌంట్లో డబ్బులు జమకాలేదు. ఎందుకంటే వీరు ఈ-కేవైసీ చేయలేదు. అందుకే బిహార్ ప్రభుత్వం జూలై 31 వరకు రైతులు ఈ కేవైసీ చేసుకోవడానికి గడుపు పొడగించింది. ఇంకా ఎవరైనా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ-కేవైసీ చేయని వారు ఉంటే వెంటనే చేసుకోవాలని సూచించింది. అప్పుడే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.
ఈ కేవైసీ చేసుకోని రైతుల సంఖ్య దాదాపు 31 శాతంగా ఉంది. డేటా ప్రకారం ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయని రైతుల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. అటువంటి రైతులను దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం ఈ-కేవైసీ తేదీని జూలై 31 వరకు పొడిగించింది. ఈ-కేవైసీ ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. దీనికి బ్యాంక్ ఖాతా ఆధార్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ వారు OTP ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
నకిలీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ-కేవైసీ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నకిలీ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం 10వ విడత సమ్మాన్ నిధిని విడుదల చేసినప్పుడు పెద్ద సంఖ్యలో అనర్హులు డబ్బులు పొందారు. ఈ క్రమంలో అలాంటి వారిని గుర్తించి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ పథకం కింద ఎటువంటి అవాంతరాలు జరగకూడదని ప్రభుత్వం ఈ-కేవైసీ ని తప్పనిసరి చేసింది. దీని కోసం మే 31 వరకు సమయం కేటాయించింది. కానీ మే 31 వరకు కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఈ-కేవైసీ చేయలేదని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి