Cryptocurrency: క్రిప్టోకరెన్సీల చట్టం తీసుకురావడం సాధ్యమేనా? పార్లమెంట్‌లో బిల్లు ఏ రకంగా ఉండొచ్చు..నిపుణులు ఏమంటున్నారు?

లోక్‌సభలో నవంబర్ 23న ఒక బులెటిన్ విడుదల చేశారు. దీంతో భారతదేశ క్రిప్టో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్‌ సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలపై చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం ఆ బులెటిన్‌లో పేర్కొంది.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీల చట్టం తీసుకురావడం సాధ్యమేనా? పార్లమెంట్‌లో బిల్లు ఏ రకంగా ఉండొచ్చు..నిపుణులు ఏమంటున్నారు?
Modi On Crypto Currency
Follow us

|

Updated on: Nov 26, 2021 | 4:28 PM

Cryptocurrency: లోక్‌సభలో నవంబర్ 23న ఒక బులెటిన్ విడుదల చేశారు. దీంతో భారతదేశ క్రిప్టో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్‌ సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలపై చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం ఆ బులెటిన్‌లో పేర్కొంది. వార్త వ్యాప్తి చెందిన వెంటనే, భారతదేశంలో సుమారు 100 మిలియన్ల క్రిప్టో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురయ్యారు. క్రిప్టో మార్కెట్ పడిపోవడం ప్రారంభమైంది. మరుసటి రోజు, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 17% వరకు పడిపోయింది.

క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు నోచుకుంటుందా ? అసలు ఈ బిల్లు ద్వారా నిజంగా క్రిప్టోను ప్రభుత్వం నిషేధించగలదా? కొత్త బిల్లు క్రిప్టో పెట్టుబడిదారులను ఎలా ప్రభావితం చేస్తుంది? వంటి విషయాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుందాం..

ఇది రూపాయి, డాలర్ లేదా మరేదైనా కరెన్సీ లాగా ఉంటుంది. అయితే, ఇది డిజిటల్ మాత్రమే. అంటే, మీరు దానిని నోటు లేదా నాణెం లాగా జేబులో ఉంచుకోలేరు. ఎందుకంటే ఈ మొత్తం కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రం ఆధారంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో తయారు అయింది. అందుకే దీనిని క్రిప్టోకరెన్సీ అంటారు.

ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి?

ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అనేది లావాదేవీ సమాచారం పబ్లిక్‌గా లేని కరెన్సీ. అంటే, ఆ కరెన్సీతో ఏమి జరుగుతోంది అనే నేపథ్యాన్ని తనిఖీ ఎవరూ చేయలేరు. పబ్లిక్ క్రిప్టోకరెన్సీ అంటే లావాదేవీ సమాచారం పబ్లిక్‌గా అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా, వాటి నేపధ్యం  తనిఖీ చేయవచ్చు. ఇది మరింత నమ్మదగినది. అయితే ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను ఎలా నిర్వచించనున్నారనేది కూడా అర్థం చేసుకోవాల్సిందే. ప్రభుత్వం కోరుకుంటే, అన్ని రకాల క్రిప్టోకరెన్సీలకు ప్రైవేట్ హోదా ఇవ్వవచ్చు.

బిల్లులో క్రిప్టోకు సంబంధించి ఏమి సాధ్యమవుతుందో తెలుసుకుందాం..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త డిజిటల్ కరెన్సీని జారీ చేయవచ్చు. ఇది ప్రభుత్వం లేదా పబ్లిక్ క్రిప్టోకరెన్సీ అవుతుంది. ప్రభుత్వం ప్రైవేట్,పబ్లిక్ క్రిప్టోకరెన్సీలను వేరు చేయడం ద్వారా ప్రైవేట్‌ను పూర్తిగా నిషేధించాలి. ప్రజల కోసం కొన్ని నియమాలు.. మరియు నిబంధనలను తీసుకురావాలి. ఏది ఏమైనప్పటికీ, మార్కెట్లో అంతగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు లేవు. దీని కారణంగా మార్కెట్ పెద్దగా ప్రభావితం కాదు.

ప్రభుత్వం క్రిప్టోను నియంత్రించవచ్చు. చాలా సాధారణ నిబంధనలను తీసుకురావడం ద్వారా దానిపై పన్నులు విధించవచ్చు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లేదా మీరు ఎంత క్రిప్టో కొనుగోలు/అమ్ముతున్నారు అనే దానిపై పన్ను విధించవచ్చు.

ప్రభుత్వం తన సొంత వాలెట్‌తో రావచ్చు. ఆర్బీఐ(RBI) ఈ వాలెట్‌ని జారీ చేస్తుంది. దీని ద్వారా మీరు క్రిప్టోకరెన్సీల లావాదేవీలు జరుపవచ్చు. దీనితో, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డులు నినిర్వహిస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా పెరుగుతుంది.

క్రిప్టోకరెన్సీలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించలేదా?

ఏ ప్రభుత్వానికైనా నియంత్రణ చేయగలిగే అవకాశం తన దేశానికే పరిమితం. అయితే, ఇంటర్నెట్ ప్రపంచానికి హద్దులు లేవు. ఇంటర్నెట్‌లో ఏ సర్వర్‌లో ఎవరు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అలాగే, క్రిప్టో ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి చాలా విలువ ఉంది. అందుకే ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధించలేదు. ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ప్రజలు వివిధ మార్గాల్లో వ్యాపారం చేయవచ్చు. క్రిప్టో ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం లేదా బ్యాంకు లేదా ఏ ఒక్క వ్యక్తి దానిపై నియంత్రణ కలిగి ఉండరు.

అలాగే, ఇలాంటి క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు చాలా ఉన్నాయి. అవి భారతదేశంలో కూడా నమోదు కావు. భారత ప్రభుత్వం చట్టం చేసినా, వాటి వల్ల పెద్దగా తేడా ఉండకపోవచ్చు.

క్రిప్టోకరెన్సీని ఎలా సృష్టిస్తారు?

మైనింగ్ ద్వారా క్రిప్టోకరెన్సీలు సృష్టించబడతాయి. ఇది వర్చువల్ మైనింగ్. దీనిలో క్రిప్టోకరెన్సీని పొందడానికి చాలా క్లిష్టమైన డిజిటల్ పజిల్‌ను పరిష్కరించాలి. ఈ పజిల్‌ని పరిష్కరించడానికి మీ స్వంత అల్గారిథమ్ (ప్రోగ్రామింగ్ కోడ్) అలాగే చాలా కంప్యూటింగ్ పవర్ అవసరం. కాబట్టి సిద్ధాంతంలో ఎవరైనా క్రిప్టోకరెన్సీని తయారు చేయవచ్చని చెప్పవచ్చు. కానీ, ఆచరణలో దీన్ని తయారు చేయడం చాలా కష్టం.

క్రిప్టోకరెన్సీలను ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారు?

మీరు రూపాయి, డాలర్, యెన్ లేదా పౌండ్ గురించి మాట్లాడేటప్పుడు, దానిని జారీ చేసిన దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ద్వారా అది నియంత్రణలో ఉంటుంది. ఈ కరెన్సీ ఎంత, ఎప్పుడు ముద్రించాలనేది దేశ ఆర్థిక పరిస్థితిని చూసి నిర్ణయిస్తారు. కానీ క్రిప్టోకరెన్సీలపై ఎవరికీ నియంత్రణ లేదు ఉండదు. ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ. దీన్ని ఏ ప్రభుత్వమూ లేదా కంపెనీ నియంత్రించలేవు. ఈ కారణంగా ఇది ప్రమాదకరం కూడా.

ఇవి కూడా చదవండి: PM Gati Shakti: భారత దేశ గతిని మార్చేసే పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రెడీ.. ఎన్ని ప్రాజెక్టులు రానున్నాయంటే?

Maharashtra Politics: మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
వార్ 2 నుంచి ఫోటోలు లీక్.. ఎన్టీఆర్ లుక్ ఇరగదీశాడుగా..!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..