IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ సర్వర్‌ డౌన్‌.. పునరుద్దరించిన రైల్వేశాఖ.. కారణం ఏంటంటే..

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను తీసుకువస్తుంటుంది. కొన్నికొన్ని సౌకర్యాలలో అప్పుడప్పుడు సాంకేతిక లోపం తలెత్తుతుంటుంది. కానీ అలాంటి లోపాలను రైల్వే శాఖ త్వరితగతిన పరిష్కరిస్తుంటుంది..

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ సర్వర్‌ డౌన్‌.. పునరుద్దరించిన రైల్వేశాఖ.. కారణం ఏంటంటే..
IRCTC
Follow us
Subhash Goud

|

Updated on: Jul 25, 2023 | 3:46 PM

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను తీసుకువస్తుంటుంది. కొన్నికొన్ని సౌకర్యాలలో అప్పుడప్పుడు సాంకేతిక లోపం తలెత్తుతుంటుంది. కానీ అలాంటి లోపాలను రైల్వే శాఖ త్వరితగతిన పరిష్కరిస్తుంటుంది. దాదాపు 15 గంటల పాటు నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ సర్వీసు మళ్లీ ప్రారంభమయ్యాయి. IRCTC సైట్ యధావిధిగా పని చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుండి టిక్కెట్ బుకింగ్ చేయవచ్చు. రైల్వేలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం కారణంగా డబ్బు నిలిచిపోయిన ప్రయాణికుల డబ్బును వాపసు చేయనున్నట్లు రైల్వే తెలిపింది. మరోవైపు, ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో కౌంటర్ల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అక్కడ నుంచి వారు బుకింగ్ చేసుకోవచ్చు. అంతకుముందు మే 6న ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పునరుద్దరించడంలో యధివిధాగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

అదనపు కౌంటర్ సౌకర్యం

ఇంతకుముందు టికెట్ బుకింగ్ యాప్, వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య దృష్ట్యా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో కౌంటర్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని భారతీయ రైల్వే పెంచింది. నాగ్‌పూర్ డివిజన్‌లో అదనంగా 6 పీఆర్‌ఎస్ టిక్కెట్ కౌంటర్‌లను ప్రారంభించారు. సెంట్రల్ రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో 22 కౌంటర్లు పనిచేస్తున్నాయి. నాగ్‌పూర్-2 అదనపు కౌంటర్లు, వార్ధా- 1, బల్లార్షా-1, చంద్రపూర్-1, బేతుల్-1, అజ్నీ-1 అదనపు అకౌంటర్లను ఓపెన్‌ చేశారు.

15 గంటల పాటు వెబ్‌సైట్ నిలిచిపోయింది

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా టిక్కెట్లు బుక్ చేయడం లేదని మంగళవారం ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేయడం ద్వారా తెలియజేసింది. సాంకేతిక సమస్య కారణంగా వెబ్, యాప్ ద్వారా చెల్లింపు చేయడంలో సమస్య ఉందని ఐఆర్‌సీటీసీ ద్వారా సమాచారం షేర్ చేసింది. ఐఆర్‌సీటీసీ చాలా మంది వినియోగదారులు టిక్కెట్ బుకింగ్ సమయంలో డబ్బు కట్‌ అయ్యాయి. కానీ టిక్కెట్‌ను బుక్ చేయడం సాధ్యపడలేదు. సీఆర్‌ఐఎస్‌ సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోందని ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేసింది. అయితే, మీరు బుకింగ్ కోసం ఆస్క్ డైరెక్షన్ ఎంపికను ఎంచుకోవచ్చు. మీ ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్‌లో డబ్బు ఉంటే, అక్కడ నుంచి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?