Samsung Refrigerators: ఫ్రిడ్జ్ కొనాలనుకొనేవారికి గుడ్ న్యూస్.. శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లపై భారీ తగ్గింపు.. వివరాలు ఇవి
రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ అనేది ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ చిన్నదో, పెద్దదో ఫ్రిడ్జ్ ఉంటోంది. వారివారి ఫ్యామిలీ సైజ్, ఇంట్లో స్పేస్ ను బట్టి సింగిల్ డోర్, డబుల్ డోరా అన్న విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే కొనుగోలు చేసే బ్రాండ్ విషయంలో కూడా చాలా ఆలోచిస్తారు. మన దేశీయ మార్కెట్లో ఫ్రిడ్జ్ అనగానే గుర్తొచ్చే బ్రాండ్లు శామ్‌సంగ్, ఎల్జీ, హయర్ వంటివి అధికంగా వినిపిస్తాయి. కొనుగోళ్లు కూడా ఇవే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్ కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్ పలు ఆఫర్లను అందిస్తోంది. ఆ ఆఫర్లేంటో తెలుసుకుందాం రండి..
Madhu |
Updated on: Jul 25, 2023 | 12:30 PM

శామ్‌సంగ్ 189 ఎల్ 5 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్(RR21C2H25S8/HL).. ఇది సిల్వర్ కలర్ ఆప్షన్లో లభిస్తోంది. దీని అసలు ధర రూ. 25,999కాగా, అమెజాన్‌లో 35శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ 16,990కే లభిస్తోంది. దీనిలో 171 లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ, 18 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీ, 5 బాటిల్ స్టోరేజ్ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, టఫెండ్ గ్లాస్‌తో ఇది వస్తుంది.

శామ్‌సంగ్ 223 ఎల్ 3 స్టారఱ్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్(RR24C2Y23S8/NL).. ఇది కూడా సిల్వర్ కలర్ ఆప్షన్లోనే వస్తుంది. అమెజాన్‌లో 25శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 22,999కాగా, కేవలం రూ. 17,290కే లభిస్తోంది. దీనిలో 205లీటర్ల సామర్థ్యంతో ఫ్రెష్ ఫుడకెపాసిటి, 18లీటర్ల ఫ్రీజర్ సామర్థ్యం, 6 బాటిల్ స్టోరేజ్, యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, టఫెండ్ గ్లాస్ షెల్ఫ్‌లు ఉంటాయి.

శామ్‌సంగ్ 189ఎల్ 4 స్టార్ డిజి-టచ్ కూల్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెకట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్(RR21C2F24DX/HL).. ఇది ల్యూక్స్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లో వస్తోంది. అమెజాన్ దీనిపై 29శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 23,999కాగా, ఆఫర్‌పై రూ. 17,090కే లభిస్తోంది. దీనిలో 171 లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ, 18 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీ, 5 బాటిల్ స్టోరేజ్, యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, డిజిటచ్ కూల్ 5 ఇన్ 1 ఉంటుంది.

శామ్‌సంగ్ 189 ఎల్ 4 స్టారఱ్ డిజి-టచ్ కూల్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ సింగిల డోర్ రిఫ్రిజిరేటర్(RR21C2E24RZ/HL).. ఇది మిడ్ నైట్ బ్లాజమ్ రెడ్ కలర్ ఆప్షన్లో లభిస్తోంది. దీనిపై 31శాతం డిస్కౌంట్ అమెజాన్ ఇస్తోంది. దీని అసలు ధర రూ. 23,999కాగా, రూ. 16,560కే సొంతం చేసుకోవచ్చు. దీనిలో 171లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ, 18 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీ, 5 బాటిల్ స్టోరేజ్, యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, డిజీ టచ్ కూల్ 5 ఇన్ 1, 4 స్టార్ రేటింగ్ ఉంటుంది.

శామ్‌సంగ్ 183ఎల్ 3 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్(RR20C1723U8/HL).. ఇది శాఫ్రాన్ బ్లూ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. దీనిపై అమెజాన్ 26శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 19,999కాగా, కేవలం రూ. 14,890కే లభిస్తోంది. దీనిలో 165లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ, 18 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీ, 5 బాటిల స్టోరేజ్, యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, 3 స్టార్ రేటింగ్ వస్తుంది.





























