Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Filing: ఏఐఎస్‌ యాప్‌ అంటే ఏమిటి? ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? వివరాలు ఇవి..

ఏఐఎస్‌/టీఐఎస్‌లో అందుబాటులో ఉన్న టీడీఎస్‌/టీసీఎస్‌, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రీఫండ్‌లు, ఇతర సమాచారం (జీఎస్టీ డేటా, విదేశీ చెల్లింపులు మొదలైనవి)కి సంబంధించిన వివరాలు చూడటానికి పన్ను చెల్లింపుదారులు మొబైల్ యాప్‌ని ఉపయోగించవచ్చు.

Income Tax Filing: ఏఐఎస్‌ యాప్‌ అంటే ఏమిటి? ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? వివరాలు ఇవి..
Ais For Tax Payers
Follow us
Madhu

|

Updated on: Jul 25, 2023 | 12:00 PM

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్‌ అనేది చాలా మందికి ఓ బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. ఓ పట్టాన అందులోని విషయాలు అర్థం కావు. పన్ను చెల్లింపుదారులకు అందులోని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. ఆడిటర్లే ఆ విషయాలు చూసుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం పన్ను చెల్లింపు విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రణాళిక చేసింది. అందులో భాగంగా ఓ యాప్‌ ను ఆదాయ పన్ను శాఖ గతేడాది మార్చిలో తీసుకొచ్చింది. దీని పైరు ఏఐఎస్‌ ఫర్‌ ట్యాక్స్‌ పేయర్స్‌. ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను సులభతం చేయడంతో పాటు వార్షిక సమాచారాన్ని అందిస్తోంది. ఏఐఎస్‌ అంటే యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ అంటారు. అలాగే టీఐఎస్‌ అంటే ట్యాక్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ సమ్మరీని కూడా యాప్‌ అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యాప్‌ ఎందుకంటే.. పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన ఏఐఎస్‌/టీఐఎస్‌ల వివరాలు వివిధ వనరుల నుంచి సేకరించి సమగ్రంగా, సులభంగా చూపడమే ఈ యాప్‌ లక్ష్యం.

యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(ఏఐఎస్‌)..

యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(ఏఐఎస్‌) అనేది ఫారమ్ 26ఏఎస్‌లో చూపిన పన్ను చెల్లింపుదారుల సమగ్ర సమాచారం. ఏఐఎస్‌లో కనపడే సమాచారంపై పన్ను చెల్లింపుదారులు ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తారు.అంతే వారి అభిప్రాయాన్ని జోడిస్తారు. ఏఐఎస్‌ మొదటి చూపిన విలువ, పన్ను చెల్లింపుదారుడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత విలువ రెండింటినీ చూపిస్తుంది. అంటే టీడీఎస్‌, ఎస్‌ఎఫ్‌టీ వంటి ఇతర సమాచారాన్ని కూడా సమగ్రంగా చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏఐఎస్‌ లక్ష్యాలు..

  • ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే సదుపాయంతో పన్ను చెల్లింపుదారులకు పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది.
  • స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహిస్తుంది. కరెక‌్షన్స్‌ లేకుండా ముందస్తుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయడానికి ఉపకరిస్తుంది.

ట్యాక్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ సమ్మరీ(టీఐఎస్‌)..

ట్యాక్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ సమ్మరీ(టీఐఎస్‌) అనేది పన్ను చెల్లింపుదారులకు వివిధ విభాగాల వారీగా రూపొందించిన సమగ్ర సమాచారానికి సంబంధించిన సంక్షిప్త రూపాన్ని అందిస్తుంది. అందులో మొదటిది ప్రాసెసెడ్‌ వ్యాల్యూ అంటే ప్రీడిఫైన్డ్‌ నియమాల ఆధారంగా లెక్కించిన విలువ, అలాగే డిరైవ్డ్‌ వ్యాల్యూ అంటే పన్ను చెల్లింపు దారుల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా లెక్కించిన విలువలను చూపిస్తుంది.

ఏఐఎస్‌ ఫర్‌ ట్యాక్స్‌ పేయర్స్‌ యాప్‌ లో ఏముంటుందంటే..

ఏఐఎస్‌/టీఐఎస్‌లో అందుబాటులో ఉన్న టీడీఎస్‌/టీసీఎస్‌, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రీఫండ్‌లు, ఇతర సమాచారం (జీఎస్టీ డేటా, విదేశీ చెల్లింపులు మొదలైనవి)కి సంబంధించిన వివరాలు చూడటానికి పన్ను చెల్లింపుదారులు మొబైల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. యాప్‌లో ప్రదర్శించబడే సమాచారంపై ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి పన్ను చెల్లింపుదారుకు ఆప్షన్‌ ఉంటుంది.

యాప్‌ ఇలా వాడాలి.. ఈ మొబైల్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి, పన్ను చెల్లింపుదారు పాన్ నంబర్‌ను ఇవ్వా‍ల్సి ఉంటుంది. ఆ నంబర్‌ ద్వారా యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు, అలాగే ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ రిజిస్టర్డ్‌ అయిన ఈ-మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసి అథంటికేషన్‌ చేసిన తర్వాత యాప్‌ ఓపెన్‌ చేయడానికి 4 సంఖ్యలతో కూడిన పిన్‌ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ను గూగుల్‌ ప్లే స్టోర్‌,లేదా యాపిల్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

యాప్‌ ‍ప్రయోజనం ఇది.. ఏఐఎస్‌ యాప్ అనేది పన్ను చెల్లింపుదారులు తమ పన్ను సంబంధిత సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఒక ఉపయోగకరమైన సాధనం. దీనిలో చూపించే సమాచారంపై మీ అభిప్రాయాన్ని అందించడానికి, దానిని పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేయడానికి కూడా ఇది అనుకూలమైన మార్గం.

యాప్‌ కి కొన్ని పరిమితులు.. అయితే ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి యాప్ మిమ్మల్ని అనుమతించదు. అలాగే మీ ఏఐఎస్‌ సమాచారాన్ని సవరించడానికి కుదరదు. వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని అందించదు. మొత్తంమీద, ఏఐఎస్‌ యాప్ అనేది పన్ను చెల్లింపుదారులు తమ పన్ను సంబంధిత సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఒక ఉపయోగకరమైన సాధనం. అయితే, దాని పరిమితుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..