Bal Jeevan Bima: చిన్నారుల కోసం ఓ బీమా పథకం.. రోజుకు రూ. 6 ఇన్వెస్ట్ చేస్తే రూ. లక్ష ఇన్సూరెన్స్‌.

సాధారణంగా జీవిత బీమా అంటే వయసు పైబడిన వారికి ఉపయోగపడేది అనే భావనలో ఉంటాము. అయితే ఇండియన్‌ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం కూడా ఒక జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బాల్ జీవన్‌ బీమా పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా..

Bal Jeevan Bima: చిన్నారుల కోసం ఓ బీమా పథకం.. రోజుకు రూ. 6 ఇన్వెస్ట్ చేస్తే రూ. లక్ష ఇన్సూరెన్స్‌.
Bal Jeevan Bima
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 24, 2022 | 8:16 PM

సాధారణంగా జీవిత బీమా అంటే వయసు పైబడిన వారికి ఉపయోగపడేది అనే భావనలో ఉంటాము. అయితే ఇండియన్‌ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం కూడా ఒక జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బాల్ జీవన్‌ బీమా పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా చిన్నారులు జీవిత బీమాను పొందొచ్చు. రోజుకు కేవలం రూ. 6 పెట్టుబడిగా పెడితే రూ. లక్ష ఇన్సూరెన్స్‌ను పొందొచ్చు. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? పాలసీని ఎలా పొందాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

చిన్నారులు అకాలంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ జీవిత బీమా పాలసీ ఉపయోగపడుతుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారులు బాల్‌ జీవన్‌ బీమా యోజన పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ చిన్నారి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కవర్‌ అవుతుంది. పాలసీ తీసుకున్న వారు రోజుకు రూ. 6 చొప్పున నెలకు రూ. 180 డిపాజిట్‌ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న సదరు చిన్నారి 18 ఏళ్ల లోపు మరణిస్తే వారి కుటుంబానికి రూ. లక్ష ఇన్సూరెన్స్‌ లభిస్తుంది.

బాల్‌ జీవన్‌ బీమా పాలసీని తీసుకోవాలనుకునే వారు నేరుగా దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత ఫామ్‌ను తీసుకొని చిన్నారి పేరు, వయసు, చిరునామాతో పాటు నామినికి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే