Ola Electric: దూసుకుపోతున్న ఓలా! కార్లు స్కూటర్లే కాదు.. ఆ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చేస్తున్నాయ్!
అందులో భాగాంగానే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు(commercial vehicles) తయారు చేసేందుకు ప్రణాళిక చేస్తోంది. త్వరలో వీటి తయారీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఒక విప్లవం తీసుకొచ్చింది ఓలా కంపెనీ. తన సొంత టెక్నాలజీతో ద్విచక్ర వాహనాలు, కార్లను తయారుచేస్తున్న కంపెనీ ప్రస్తుతం తన మార్కెట్ ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగాంగానే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు (commercial vehicles) తయారు చేసేందుకు ప్రణాళిక చేస్తోంది. త్వరలో వీటి తయారీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది తన తొలి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాన్ని పరిచయం చేసే అవకాశం ఉంది.
సొంత సాంకేతికతతోనే..
ఓలా కంపెనీ ఇప్పటి వరకూ మార్కెట్ లోకి విడుదల చేసిన ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లు, కార్లు అన్నీ కూడా తన సొంత సాంకేతికతతోనే తయారు చేసింది. ఎక్కడ డీలర్ షిప్ మోడల్ను అవలంభించలేదు. దీంతో తన వద్ద సాంకేతికతతోనే మరిన్ని వాహనాలు తయారు చేసేందుకు వీలవుతుందని ఓలా ఎలక్ట్రిక్ కో ఫౌండర్ భవిష్ అగర్వాల్ చెప్పారు. త్వరలో ఈ కమర్షియల్ వాహనాల తయారీ ప్రారంభిస్తామని వెల్లడించారు. తమ స్కూటర్లు, బైక్లు, కార్లతోనే పాటే ఏక సమయంలో ఈ వాహనాలకు కూడా తయారుచేస్తామని ప్రకటించారు.
ప్రతి విభాగానికి ప్రత్యేక టీంలు..
ఓలా కంపెనీలో ద్విచక్ర వాహనాలకు ఒక టీం, కార్లకు ఒక టీం, వాణిజ్య వాహనాల కోసం ఒక టీం పనిచేస్తుంటాయి. ప్రతి దానిలో ఒకటే సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంటుంది, సెల్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ దాదాపు ఒకటే వినియోగిస్తారు. ప్రతి టీం ఇన్డివిడ్యూవల్ గా పనిచేస్తుంటుంది.
లిథియ్ బ్యాటరీల వినియోగం ఇక్కడే అధికం..
లిథియ్ ఐయాన్ బ్యాటరీల వినియోగం తమ సంస్థలోనే అత్యధికం అని ఓలా కో ఫౌండర్ అగర్వాల్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఆఖరికి తామే సొంతంగా బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని, తమ అవసరాలు తీరాక ఇతరులకు కూడా విక్రయించేలా బ్యాటరీల తయారీ యూనిట్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న బ్యాటరీల తయారీ దారులకు కూడా తామే బ్యాటరీలను అమ్మే విధంగా పనిచేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఇండియాతో పాటు యూరప్, లాటిన్ అమెరికాలో కూడా తమ కంపెనీ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఆయన విజన్ ను వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..