AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home loan: హోమ్ లోన్ పై వడ్డీ బాదుడే బాదుడు.. ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అందుకే దాన్ని సమకూర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. సొంతిల్లు ఉన్నప్పుడే సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. నేడు ఉద్యోగాల కోసం యువత సొంత ఊరిని వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. మంచి ఉద్యోగం, తద్వారా ఆదాయం వస్తున్నప్పుడు వారందరూ సొంత ఫ్లాట్ సమకూర్చుకోవాలని ఆలోచిస్తారు. అలాంటి వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.

Home loan: హోమ్ లోన్ పై వడ్డీ బాదుడే బాదుడు.. ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Home
Nikhil
|

Updated on: Aug 02, 2024 | 9:15 PM

Share

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అందుకే దాన్ని సమకూర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. సొంతిల్లు ఉన్నప్పుడే సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. నేడు ఉద్యోగాల కోసం యువత సొంత ఊరిని వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. మంచి ఉద్యోగం, తద్వారా ఆదాయం వస్తున్నప్పుడు వారందరూ సొంత ఫ్లాట్ సమకూర్చుకోవాలని ఆలోచిస్తారు. అలాంటి వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. వాటికి ప్రతినెలా ఈఎంఐల రూపంలో వాయిదాలు కట్టాలి. రుణం తీసుకున్నసొమ్ముతో పాటు వడ్డీకూడా దానిలో కలిపి ఉంటుంది. సాధారణంగా ఈ రుణ వాయిదాల వ్యవధి దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పైగానే ఉంటుంది. దీంతో అప్పుపై చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగా విధిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా హోమ్ లోన్ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. దాని వల్ల వడ్డీ రూపంలో సొమ్ములను ఆదా చేయవచ్చు.

అవగాహన అవసరం

ఇల్లు లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కోసం 28/36 నియమం ఉపయోగపడుతుంది. అంటే మీకు వచ్చే ఆదాయంలో ఈఎంఐ 28 శాతం, మొత్తం రుణానికి 36 శాతం మించి కేటాయించకూడదు. ఎందుకుంటే మీకు హోమ్ లోన్ తో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక, వివిధ ఖర్చులపై అవగాహన అవసరం.

కాల వ్యవధి

ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలవ్యవధిలో 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ. 1 కోటికి ఇంటిని కొనుగోలు చేస్తే దాని కోసం రూ.20 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ.80 లక్షలను బ్యాంకు నుంచి రుణం అవసరం అవుతుంది. అయితే మీరు పూర్తిగా రుణం చెల్లించేసరికీ మొత్తం రూ. 192,74,738 అవుతుంది. ఇందులో వడ్డీగా రూ. 92,74,738 కట్టాల్సి ఉంటుంది. ఇది దాదాపు ఇంటి ఖరీదుతో సమానం. కాబట్టి వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి.

ఇవి కూడా చదవండి

అదనపు ఈఎంఐలు

హోమ్ లోన్ కోసం ప్రతి నెలా ఈఎంఐలు కడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో ఒక ఈఎంఐ అదనంగా కట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ రుణం మొత్తం తగ్గుతుంది. కాలక్రమేణా మీరు చెల్లించే వడ్డీ కూడా తగ్గిపోతుంది.

ఈఎంఐ టాప్ అప్

ఈఎంఐ మొత్తాన్ని టాప్ అప్ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. దాన్ని పదిశాతం పెంచడం వల్ల మీరు లోన్ కాలపరిమితి నాలుగేళ్లు తగ్గుతుంది. అలాగే వడ్డీ రూ.22,48,950 ఆదా అవుతుంది. అదే ఈఎంఐని 20 శాతం పెంచడం ద్వారా లోన్ వ్యవధిని ఏడేళ్ల కు తగ్గించుకుని, దాదాపు రూ.35,61.366 వడ్డీని తగ్గించుకోవచ్చు. ఈ విధానం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే కోటి రూపాయలకు ఇల్లు కొని, దానికి వడ్డీ రూపంలో మరో 92 లక్షలు చెల్లించడం అంటే ఎక్కువ మొత్తం నష్టపోయినట్టే.

వడ్డీ పొదుపు

హోమ్ లోన్ కు అదనపు ఈఎంఐలకు చెల్లించడానికి వివిధ పద్దతులు ఉన్నాయి. మీకు వచ్చే వార్షిక బోనస్‌లు, పన్ను రీఫండ్‌లు, సంవత్సరాంతపు బోనస్‌లను హోమ్ లోన్ కు జమచేయవచ్చు. దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక ప్రణాళికకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే హోమ్ లోన్ మొత్తం తగ్గడం వల్ల వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొదుపు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి