AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Playstation Portal Remote: టీవీ, మోనిటర్ లేకుండానే గేమ్స్ ఆడుకోవచ్చు.. ఈ కొత్త రిమోట్‌తో ఎక్కడైనా..

గేమింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇకపై ఎటువంటి మానిటర్ లేకుండా గేమ్స్ ఆడుకునే వెసులుబాటు కలుగనుంది. అందుకోసం ప్లే స్టేషన్ ఇండియా ప్రత్యేకమైన పోర్టల్ రిమోట్ ప్లేయర్ ను లాంచ్ చేసింది. ఈ ప్లే స్టేషన్ పోర్టల్ రిమోట్ ను ప్లే స్టేషన్ కన్సోల్లో జస్ట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే ఇది కొన్ని అనుకూల గేమ్స్ కు మాత్రమే పనిచేస్తుంది.

Playstation Portal Remote: టీవీ, మోనిటర్ లేకుండానే గేమ్స్ ఆడుకోవచ్చు.. ఈ కొత్త రిమోట్‌తో ఎక్కడైనా..
Playstation Portal Remote Player
Madhu
|

Updated on: Aug 02, 2024 | 6:56 PM

Share

గేమింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇకపై ఎటువంటి మానిటర్ లేకుండా గేమ్స్ ఆడుకునే వెసులుబాటు కలుగనుంది. అందుకోసం ప్లే స్టేషన్ ఇండియా ప్రత్యేకమైన పోర్టల్ రిమోట్ ప్లేయర్ ను లాంచ్ చేసింది. ఈ ప్లే స్టేషన్ పోర్టల్ రిమోట్ ను ప్లే స్టేషన్ కన్సోల్లో జస్ట్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే ఇది కొన్ని అనుకూల గేమ్స్ కు మాత్రమే పనిచేస్తుంది. అంతేకాక కేవలం ప్లే స్టేషన్ 5 లేదా ప్లే స్టేషన్ 4 కన్సోల్లో మాత్రమే ఈ ప్లే స్టేషన్ పోర్టల్ రిమోట్ ప్లేయర్ పనిచేస్తుంది. దీని ధర రూ. 18,990గా ఉంది. ఇది సోని సెంటర్లు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, బ్లింకిట్ వంటి స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రస్తుతం అమెజాన్లో ఈ పోర్టల్ ప్లేయర్ ధర రూ. 24,520గా ఉంది. తక్కువ ధరకు కావాలంటే మూడో తేదీ వరకూ వేచి ఉండాల్సిందే.

ఇతర వాటితో పోల్చితే..

ఈ ప్లే స్టేషన్ పోర్టల్ రిమోట్ ప్లేయర్ ధర ఆర్ఓజీ అల్లీ(ROG Ally) లేదా ఎంఎస్ఐ క్లా(MSI Claw)లతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ఆర్ఓజీ అల్లీ, ఎంఎస్ఐ క్లా లను మీరు స్టాండ్ అలోన్ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ డివైజ్ గా వినియోగించుకోవచ్చు. కానీ ప్లే స్టేషన్ పోర్టల్ మాత్రం ప్లే స్టేషన్ 5, ప్లే స్టేషన్ 4 కన్సోల్ పై ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది. అంతేకాక ఈ పోర్టల్ పనిచేయాలంటే మీ పీసీకి ఉన్న అదే వైఫై కనెక్షన్ కావాలి. ఒకే కనెక్షన్ ఉంటే టీవీ లేకుంటే కనెక్షన్ అందుబాటులో ఉండే ఏప్రాంతంలో అయినా వినియోగించుకోవచ్చు.

ప్లే స్టేషన్ పోర్టల్ రిమోట్ ప్లేయర్ పనితీరు ఇలా..

ప్లేస్టేషన్ పోర్టల్ రిమోట్ ప్లేయర్ మీ ఇంటి వై-ఫై ద్వారా మీ అరచేతిలో నుంచి మీ పీఎస్5 గేమ్‌లను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది టీవీ అవసరాన్ని తొలగిస్తుంది. ఈ పరికరం పీఎస్5 మరియు పీఎస్4 రెండింటితో సహా మీ పీఎస్5లో ఇన్‌స్టాల్ చేయబడిన ఏవైనా అనుకూలమైన గేమ్‌లను ప్లే చేయగలగుతుంది. రిమోట్ ప్లేయర్ డ్యూయల్‌సెన్స్ వైర్‌లెస్ కంట్రోలర్‌ని ఉపయోగిస్తుంది. ఇది హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, అడాప్టివ్ ట్రిగ్గర్‌లను కలిగి ఉంటుంది. రిమోట్ ప్లేయర్ 8-అంగుళాల పూర్తి హెచ్డీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1080పీ రిజల్యూషన్‌లో 60ఎఫ్పీఎస్ వరకు గేమ్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..