UPI-Based Bank: భారతదేశంలో మొట్టమొదటిగా UPI ఆధారిత బ్యాంక్.. సేవలన్ని అదుర్స్
UPI-Based Ban: ఒక బ్రాంచ్ రోబోట్ అసిస్టెంట్, యూపీఐ ఆధారిత బ్యాంకింగ్ ప్రక్రియలను చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్లైస్ UPI-లింక్డ్ క్రెడిట్ కార్డ్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వార్షిక లేదా జాయినింగ్ ఫీజు లేకుండా కస్టమర్లకు..

UPI-Based Bank: ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకునే వారు నేడు ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఆన్‌లైన్ చెల్లింపుల పద్దతుల్లో సులభమైన మార్గాలు వచ్చాయి. దేశంలో యూపీఐ వ్యవస్థ ఎంతగానో విస్తరించింది. ప్రతి రోజు కోట్లాది రూపాయలు యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశంలో యూపీఐ సేవలు వచ్చిన తర్వాత మరింత సులభం అయిపోయింది. ఇక దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందించాలనే ఉద్దేశంతో స్లైస్ (slice) బ్యాంక్ UPI ఆధారిత క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీని ద్వారా భారతదేశంలో బ్యాంకింగ్ విధానాన్ని మార్చాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Minimum Balance Rules: ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల ఎత్తివేత
భారతదేశంలోనే మొట్టమొదటి యూపీఐతో పనిచేసే భౌతిక బ్యాంక్ శాఖను, ATMను ప్రారంభించింది. వేగంగా బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుఉంది. స్లైస్ సూపర్ కార్డ్ పేరుతో విడుదల చేసిన ఈ యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు సులభంగా క్రెడిట్ పొందవచ్చు. ఈ కంపెనీ ఇటీవలే NESFBతో విలీనం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించడంతో పాటు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో..! ఏం మింగిందో ఏందో.. భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది..
ఈ స్లైస్ బ్యాంక్ బెంగళూరులోని కోరమంగళలో సరికొత్త యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను ప్రారంభించింది. ఇది బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇప్పుడు డిజిటల్ బ్యాంక్ శాఖకు వెళ్లి, వేగవంతమైన సేవలను పొందవచ్చని స్లైస్ బ్యాంక్ తెలిపింది. UPI ATM ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. డిపాజిట్ కూడా చేయవచ్చు. అంతే కాదండోయ్ దీని ద్వారా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం, ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా ఈ యూపీఐ ఆధారిత బ్రాంచులో పొందే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది.
A full-blown UPI bank branch just dropped in @peakbengaluru. No debit cards, no forms, just scan and deposit/withdraw cash with UPI ATMs and of course, there’s a robot!!
Koramangala 80 Feet Road regulars know this building’s legacy in shaping our startup ecosystem 🦄 pic.twitter.com/l6xULTD52T
— Peak Bengaluru (@peakbengaluru) July 3, 2025
కోరమంగళలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఈ బ్రాంచ్ కస్టమర్లు కార్డులకు బదులుగా UPI యాప్‌ని ఉపయోగించి డబ్బు డిపాజిట్ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ వ్యవస్థలో డిజిటల్ కియోస్క్‌లు ఉన్నాయి. వినియోగదారులు టాబ్లెట్‌లను ఉపయోగించి సేవింగ్స్ ఖాతాలను తెరవవచ్చు. బ్రాంచ్ ప్రాంగణంలో కస్టమర్లకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే రోబోట్ కూడా ఉంది.
రోబో అసిస్టెంట్ వీడియో వైరల్:
ఒక బ్రాంచ్ రోబోట్ అసిస్టెంట్, యూపీఐ ఆధారిత బ్యాంకింగ్ ప్రక్రియలను చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్లైస్ UPI-లింక్డ్ క్రెడిట్ కార్డ్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వార్షిక లేదా జాయినింగ్ ఫీజు లేకుండా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కార్డ్ కొనుగోళ్లపై 3% వరకు క్యాష్‌బ్యాక్, 3 వడ్డీ లేని EMIలలో చెల్లింపులు చేయడానికి అనుమతించే ‘స్లైస్ ఇన్ 3’ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి