AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం కొనుగోలులో జాగ్రత్తలు మస్ట్.. ఎంత నష్టపోతున్నారో తెలిస్తే షాక్..!

భారతదేశం ప్రపంచంలోనే అగ్రశ్రేణి బంగారు వినియోగదారుల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఆభరణాలకు దేశంలో అధిక డిమాండ్‌ ఉంటుంది. 2024లో భారతదేశ బంగారం వినియోగంలో దాదాపు 50 శాతం ఆభరణాల వాటా ఉంది. అంటే దాదాపు ఇది 563.4 టన్నులుగా ఉంది. ఈ క్రమంలో బంగారం వినియోగంలో చైనాను భారతదేశంలో దాటిందంటే అది బంగారు ఆభరణాలకు ప్రజలకు కొనుగోలు చేసే బంగారం వల్లే అని నిపుణులు చెబుతున్నారు.

Gold Prices: బంగారం కొనుగోలులో జాగ్రత్తలు మస్ట్.. ఎంత నష్టపోతున్నారో తెలిస్తే షాక్..!
gold
Nikhil
|

Updated on: Jul 04, 2025 | 2:55 PM

Share

భారతదేశంలో మొత్తం బంగారం డిమాండ్ 2024లో 802.8 టన్నులకు పెరిగింది. 2023లో 761 టన్నుల ఉంటే ఐదు శాతం పెరిగింది. బలమైన ఆభరణాల కొనుగోళ్లతో పాటు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడి ఆసక్తి పెరుగుదల వల్ల ఈ స్థాయి కొనుగోళ్లు సాధ్యమయ్యాయి.  అయితే చాలా మంది భారతీయులు సాంస్కృతిక బంగారం కొనుగోలును మంచి ఆర్థిక పెట్టుబడి అని భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యంగా వివాహాలు, పండుగల చుట్టూ బంగారం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బంగారం విలువను కలిగి ఉన్నప్పటికీ అది ఇతర ఆస్తుల మాదిరిగా రాబడిని ఇవ్వదని నిపుణులు పేర్కొన్నారు. డివిడెండ్ చెల్లించే స్టాక్‌లు, అద్దె సంపాదించే ఆస్తి లేదా వడ్డీని ఉత్పత్తి చేసే బాండ్ల మాదిరిగా కాకుండా బంగారం లాకర్‌లో ఉంటుందని వివరిస్తున్నారు. 

ప్రజలు బంగారంలో తమ డబ్బులో 20-30 శాతం వెంటనే మేకింగ్ ఛార్జీల వల్ల నష్టపోతున్నారని పెద్దగా పట్టించుకోరని నిపుణులు చెబుతున్నారు. మీరు ఆభరణాలను పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటే మీరు నష్టంతో ప్రారంభిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. అలాగే ద్రవ్యతతో పాటు భద్రత కూడా ప్రధాన సమస్యగా మారుతుందని చెబుతున్నారు. స్వచ్ఛత తనిఖీలు, డీలర్ కోతల కారణంగా భౌతిక బంగారాన్ని నగదుగా మార్చడం కష్టం కావచ్చని చెబుతున్నారు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి ఎంపికగా అని సూచిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు నిల్వ ఇబ్బందులతో పాటు ఛార్జీలు లేకుండా మీకు మంచి ధరను అందిస్తాయని సూచిస్తున్నారు. బంగారం అనేది మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో భాగం కావాలి కానీ మొత్తం ప్రణాళికలో భాగం కాకూడదని సూచిస్తున్నారు. 

ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్‌లు, ఎన్‌పీఎస్ వంటి పదవీ విరమణ పథకాలు మీ డబ్బు వృద్ధి చెందడానికి సహాయపడతాయని కాబట్టి ఆ రంగంలో కూడా పెట్టుబడులను వైవిధ్యపర్చాలని సూచిస్తున్నారు. అయితే క్యూ1 చివరి రోజున బంగారం ధరలు బాగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ.550 పెరిగి రూ.96,014కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లు, భారతీయ ఈక్విటీల్లో క్షీణత తర్వాత ధర పుంజుకుంది. సెన్సెక్స్, నిఫ్టీ 121 పడిపోతే పెట్టుబడిదారులు వెంటనే బంగారం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కాబట్టి బంగారం ధర విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి