AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఈ ప్రయాణికులకు రైల్వే పెద్ద గిఫ్ట్.. త్వరలో ఈ సదుపాయం!

రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందిస్తుంది. అలాగే సామాన్య ప్రయాణికుల నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకు రకరకాల సౌకర్యాలను తీసుకువస్తుంటుంది..

Indian Railways: ఈ ప్రయాణికులకు రైల్వే పెద్ద గిఫ్ట్.. త్వరలో ఈ సదుపాయం!
Indian Railways
Subhash Goud
|

Updated on: Sep 10, 2024 | 12:13 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త రాబోతోంది! ఎందుకంటే పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కరోనా కాలంలో రైల్వేలు ఇచ్చే సీనియర్ సిటిజన్ రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఈ సదుపాయాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది జరిగితే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన ఈ ముఖ్యమైన టికెట్ రాయితీని ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు పునఃప్రారంభించవచ్చు. ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే, ప్రధాని మోదీ హయాంలో సీనియర్ సిటిజన్‌లకు ఇదే అతిపెద్ద బహుమతి అవుతుంది.

ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ, కరోనా కాలం తరువాత రైలులో సీనియర్ సిటిజన్ల ప్రయాణం పెరిగింది. దిగువ సభలో ఒక ప్రశ్నకు రాత పూర్వక సమాధానం ఇస్తూ, రైల్వే మంత్రి 20 మార్చి 2020 నుండి 31 మార్చి 2021 వరకు 1.87 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Richest Village: ఇది ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం.. ఇక్కడ 17 బ్యాంకులు, రూ.7 వేల కోట్ల డిపాజిట్లు.. మన దేశంలోనే..

ఇవి కూడా చదవండి

కానీ 1 ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 4.74 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించారు. అప్పుడు ప్రభుత్వం రైల్వే ఛార్జీలలో రాయితీని నిరాకరించింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

నాలుగేళ్ల తర్వాత..

దేశంలోని సీనియర్ సిటిజన్లకు 4 సంవత్సరాల తర్వాత రైలు ప్రయాణ ఛార్జీలలో రాయితీని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏసీ కోచ్‌కు బదులుగా స్లీపర్‌పై మాత్రమే ఈ తగ్గింపు ప్రారంభమవుతుందని అంచనా. ఆర్థికంగా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించలేని సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు రిజర్వేషన్ ఫారమ్‌లో డిస్కౌంట్ ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలిస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి