Indian Railways: గుడ్‌న్యూస్‌.. రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే!

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే భారతీయ రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు సైతం ఎక్కువ ఈ రైలు ప్రయాణమే చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలంటే..

Indian Railways: గుడ్‌న్యూస్‌.. రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే!
Indian Railways
Follow us

|

Updated on: May 25, 2024 | 4:15 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే భారతీయ రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు సైతం ఎక్కువ ఈ రైలు ప్రయాణమే చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్స్‌ బుక్‌ చేసుకుంటాము. టికెట్స్‌ కోసం కొన్ని నెలల ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో నెల ముందు బుక్‌ చేసుకుంటాము.

ఈ బుకింగ్‌లో తత్కాల్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఒక రోజు ముందు ప్రయాణం చేయాలంటే బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో తత్కాల్‌ టికెట్‌ను బుక్‌ చేసుకోవాలి. అదే కొన్ని గంటల ముందు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో రైలు బయలుదేరడానికి ఓ 5 నిమిషాల ముందు కూడా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

చాలా మంది రైలు ప్రయాణం కోసం ముందుగానే టికెట్స్‌ బుక్‌ చేసుకుని టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే రెండు ఛార్ట్‌లను రెడీ చేస్తుంటుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రెడీ చేస్తుంది. ఇక రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు తయారు చేస్తుంది. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు రైల్వే అధికారులు. రైలు బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది రైల్వే. అయితే బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మధ్య స్టేషన్ నుంచి కావాలంటే అనుమతి ఉండదు. ఇక వేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది.

ఎలా తెలుసుకోవాలంటే?

అయితే రైలు బయలుదేరడానికి చివరి నిమిషంలో టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే ముందుగా ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నాయా?లేదా అనే విషయాన్ని తెలసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే అధికారులు రెడీ చేసిన ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఛార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా ONLINE CHARTS వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా చెక్‌ చేసుకోవచ్చు. అక్కడ ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత GET TRAIN CHARTపై క్లిక్‌ చేయాలి. అప్పుడు వెంటనే మీరు కెటగిరిల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు కనిపిస్తాయి. ఒక వేళ ఖాళీ సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే అక్కడ జీరో కనిపిస్తుంది. కోచ్‌ నంబర్‌, బెర్త్‌… మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌  ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి