AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Operations India: ఆపిల్ ఉత్పత్తులకు కీలకంగా భారత్.. భవిష్యత్‌ కోసం మతిపోయే ప్లాన్

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ అందరికి తెలిసిందే. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే వస్తువుల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆపిల్ నుంచి విడుదలయ్యే ఐఫోన్లను కొనుగోలు చేయడానికి షాపుల ముందు బారులు తీరతారు.

Apple Operations India: ఆపిల్ ఉత్పత్తులకు కీలకంగా భారత్.. భవిష్యత్‌ కోసం మతిపోయే ప్లాన్
Apple Operations India
Nikhil
|

Updated on: Nov 09, 2024 | 2:54 PM

Share

ఆపిల్ ఉత్పత్తుల అభివృద్ధి లో మన దేశం కూడా త్వరలో ప్రధాన పాత్ర పోషించనుంది. పరిశోధన, డిజైన్, టెస్టింగ్ తో సహా ఆపిల్ కు చెందిన కొత్త ఉత్పత్తుల అభివద్ధిలో కీలకంగా మారునుంది. ఈ కంపెనీ ఆపిల్ ఆపరేషన్స్ ఇండియా పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ)కి గత వారం ఆపిల్ ఐఎన్ సీ ఒక ఫైల్ దాఖలు చేసింది. ఆపరేషనల్, ఫైనాన్సియల్ సపోర్టు అందజేస్తుందని హామీ ఇస్తూ కంఫర్ట్ లెటర్ అందజేసింది. ఎంటీటీ, ఇతర అంశాలతో పాటు ఇంజినీరింగ్ పరికరాలు, లీజు సౌకర్యాలు, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం ఇంజినీర్లను నియమించుకోవడానికి, ఆపిల్ గ్రూప్ కంపెనీలకు వైఫల్య విశ్లేషణ సేవలను ఇక్కడి నుంచే అందించాలని యోచిస్తోంది.

ఆపిల్ కంపెనీ ప్రస్తుతం తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను అమెరికా, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్‌ దేశాలలో నిర్వహిస్తోంది. ఒక వేళ మన దేశంలో హార్డ్‌వేర్ డిజైన్, టెస్టింగ్‌ చేపడితే ఇదే ప్రథమం అవుతుంది. మనదేశంలో ప్రస్తుతం సామ్సంగ్, ఎల్జీ, సోనీ తదితర ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. ఒప్పో,వీవో తదిరత చైనీస్ ఫోన్ల తయారు దారులు కూడా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ఆర్థిక వైరుధ్యం వల్ల కూడా ఆపిల్ మన దేశంలో కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి కారణమని తెలుస్తోంది. దీనితో దేశంలోని సాంకేతిక నైపుణ్యాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతోంది.

భారత దేశంలో ఆపిల్ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆ కంపెనీ ప్రస్తుతం రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. వీటికి అదనంగా మరో తెరవాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో మ్యాప్ ల అభివద్ధి చేపట్టింది. ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించి మన దేశం దాదాపు 14 శాతం సహకారం అందజేస్తోంది. ఆ సంస్థ 2017 లో విస్ట్రోన్ ద్వారా మన దేశంలో ఐఫోన్ అను అసెబ్లింగ్ చేయడం ప్రారంభించింది. కోవిడ్ తర్వాత ఉత్పత్తిని మరింత వేగవంతం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి