ATM Updates: మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఏంటో తెలుసా..?

ATM Updates: ఏటీఎంలో ఎంత మంది డబ్బు విత్‌డ్రా చేసారు? ఎంత మంది ఆన్‌లైన్‌లో చెల్లించారు? యూపీఐని ప్రవేశపెట్టిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపుల్లో విపరీతమైన వృద్ధి నమోదైందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

ATM Updates: మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఏంటో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2024 | 1:57 PM

డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఉపయోగించే ఏటీఎం మిషన్ల సంఖ్య తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం ఆన్‌లైన్ లావాదేవీలే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎం ఉండడం బ్యాంకులకు నష్టదాయకంగా మారుతోంది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ATMలు ఇన్‌స్టాల్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని ఏటీఎంల సంఖ్య తగ్గిందో తెలుసుకుందాం.

ఎన్ని ఏటీఎంలు తగ్గాయి?

సెప్టెంబర్ 2024ని సెప్టెంబర్ 2023తో పోల్చినట్లయితే, ATMల సంఖ్య తగ్గింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2023లో మొత్తం ఏటీఎంల సంఖ్య 2,19,281, సెప్టెంబర్ 2024 నాటికి 2,15,767కి తగ్గింది. అంటే 1.6% ఏటీఎంలు తగ్గాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం డిజిటల్‌ టెక్నాలజీతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవాటు పడిపోయారు. యూపీఐ చెల్లింపులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసేవారి సంఖ్య భారీగా తగ్గింది. అంతేకాదు దీని వల్ల బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. దీంతో ఏటీఎంల సంఖ్య తగ్గిస్తున్నాయి బ్యాంకులు. కానీ 2023కి ముందు ఏటీఎంల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఆ తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.

బ్యాంకు ప్రకారం.. రెండు రకాల ఏటీఎంలు ఉన్నాయి. ఆన్-సైట్‌లోఒకటి. అంటే బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రతిచోటా ఏటీఎం ఉంటుంది. రెండవది, ఆఫ్-సైట్ ఏటీఎం ఇవి మాల్స్ లేదా బ్యాంకులు కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేసిన ఏటీఎంలు. గత నాలుగేళ్లుగా ఆఫ్‌సైట్ ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2021 నాటికి ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య 97,383. అదే ఆఫ్-సైట్ ఏటీఎంలు సెప్టెంబర్ 2022లో 97,072కి పెరిగాయి. సెప్టెంబర్ 2020 నాటికి ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య 93,751. సెప్టెంబర్ 2024 నాటికి కేవలం 87,838 ఆఫ్-సైట్ ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. అంటే 2021లో కంటే 2024లో ఆఫ్‌సైట్ ATMల సంఖ్య 10% వరకు తగ్గాయి.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలోని అత్యంత ఖరీదైన 7 నివాస ప్రాంతాలు.. దేశంలోని 57 మంది బిలియనీర్లు ఇక్కడే..

ఏటీఎంని ఇన్‌స్టాల్ చేయడానికి స్థలాన్ని తీసుకోవడానికి, భద్రతను నిర్వహించడానికి, దానిని నిరంతరం నోట్లను చేయడానికి బ్యాంక్ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి ఏటీఎం కథ ముందుకు సాగుతుందా లేక తగ్గుముఖం పడుతుందా అనేది చూడాలి. మరోవైపు ఆన్‌లైన్ చెల్లింపుల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.

ఆన్‌లైన్ లావాదేవీలు ఎంత పెరిగాయి?

ఏటీఎంలో ఎంత మంది డబ్బు విత్‌డ్రా చేసారు? ఎంత మంది ఆన్‌లైన్‌లో చెల్లించారు? యూపీఐని ప్రవేశపెట్టిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపుల్లో విపరీతమైన వృద్ధి నమోదైందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

2019-20లో 3,40,026 లక్షల కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2020-21లో 4,37,445 లక్షల కోట్ల లావాదేవీలకు పెరిగింది. 2021-22లో 7,19,531 లక్షల కోట్ల లావాదేవీలు పెరిగాయి. అలాగే ఈ లావాదేవీ 2022-23లో రూ.11,39,476 లక్షల కోట్లు అవుతుంది. 2023-24లో లావాదేవీలు రూ.16,44,302 లక్షల కోట్లకు పెరిగాయని, ఇందులో 13,11,295 లక్షల కోట్ల లావాదేవీలు, యూపీఐ ద్వారానే జరిగాయని తెలుస్తోంది. జూలై 2024 నాటికి, UPI ద్వారానే రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: BSNL: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4 ప్లాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..