Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump Towers: హైద‌రాబాద్‌లో అమెరికా అధ్యక్షుని ట‌వ‌ర్స్.. ట్రంప్ ప్లాట్ చాలా కాస్ట్లీ గురూ..!

ట్రంప్ టవ‌ర్స్ ఇప్పుడు హైద‌రాబాద్ లో కూడా నిర్మించ‌బోతున్నారు. మాదాపూర్‌లో ఖానామెట్‌లో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణం భారీ స్థలంలో చేయ‌డానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Trump Towers: హైద‌రాబాద్‌లో అమెరికా అధ్యక్షుని ట‌వ‌ర్స్.. ట్రంప్ ప్లాట్ చాలా కాస్ట్లీ గురూ..!
Trump Towers Feature Image
Follow us
Prabhakar M

| Edited By: Ravi Kiran

Updated on: Nov 09, 2024 | 4:49 PM

హైద‌రాబాద్‌లో అమెరికా అధ్యక్షుని ట‌వ‌ర్స్ రానున్నాయి. డోనాల్డ్ ట్రంప్ ట‌వ‌ర్స్ హైద‌రాబాద్ లో ఏంటి అనుకుంటున్నారా..? ఎస్ నిజమే ట్రంప్ టవ‌ర్స్ ఇప్పుడు హైద‌రాబాద్ లో కూడా నిర్మించ‌బోతున్నారు. మాదాపూర్‌లో ఖానామెట్‌లో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణం భారీ స్థలంలో చేయ‌డానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

హైదరాబాద్‌ లో టవర్స్‌ నిర్మాణానికి 2022లోనే ఈ ప్రాజెక్ట్‌ కోసం భూమి కొనుగోలు చేశారు. భారత్‌లో ఇప్పటికే పలు నగరాల్లో నిర్మించిన ట్రంప్‌ కంపెనీ, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ట్రంప్ టవర్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ఇప్పటికే ట్రంప్ టవర్లు ఉన్నాయి. తాజాగా మరో ఆరు ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం చేయాలని ఈ సంస్థ నిర్ణయించింది, ఇందులో హైదరాబాద్, నోయిడా, బెంగళూరు, పుణే కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, భారత్‌లోని ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరుకోనుంది, ఇది అమెరికా వెలుపల అత్యధికంగా ఉన్న ట్రంప్ టవర్ల సంఖ్య కానుంది.

జాయింట్ వెంచర్‌లో ట్రంప్ ట‌వ‌ర్స్

హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ జంట టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. 2022లో మాదాపూర్‌లోని ఖానామెట్ ప్రాంతంలో 2.92 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ వేలంలో కొనుగోలు చేశారు. ఈ టవర్లు 27 అంతస్తులతో 4 – 5 బెడ్‌రూం ల అపార్టుమెంట్లుగా నిర్మించ‌నున్నారు. 4 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 4,000 నుండి 5,000 చదరపు అడుగులు ఉండగా, 5 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 6,000 చదరపు అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు హైద‌రాబాద్ లో కొన్ని అపార్ట్‌మెంట్స్ మాత్రమే ఇంత పెద్ద విస్తిర్ణంలో జరిగింది. ఇప్పుడు ట్రంప్ ట‌వ‌ర్స్‌లో ఇంత పెద్ద విస్తిర్ణం రావ‌డం హైద‌రాబాద్ మార్కేట్ లో కొత్త అనే చెప్పాలి..!

ట్రంప్ ట‌వ‌ర్స్ లో ప్లాట్ చాలా కాస్ట్లీ..!

ఇక అంత‌ర్జాతీయ సంస్థ కావడం ఆ పేరే ఓ బ్రాండ్ కావ‌డంతో ప్రైస్ కూడ అలానే ఉండ‌బోతుంది. చదరపు అడుగుకు రూ.13 వేల ధరను నిర్ణయించనున్నారు. దీనితో 4 బెడ్‌రూం అపార్టుమెంట్‌ ధర సుమారు రూ.5.5 కోట్లు అవుతుంది. అలాగే, ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించబోయే టవర్లలో అపార్టుమెంట్లతో పాటు కార్యాలయాలు, విల్లాలు, గోల్ఫ్‌ కోర్స్‌లు వంటి ప్రత్యేక వసతులు కూడా ఉండనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..