SBI net profit: ఎస్‌బీఐకు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే..!

ప్రముఖ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాభాల బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్ఠిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది. రికార్డు స్థాయిలో రూ.18,331 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రుణాల మంజూరు పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గడం కూాడా దీనికి కారణాలలో ఉన్నాయి.

SBI net profit: ఎస్‌బీఐకు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే..!
Follow us
Srinu

|

Updated on: Nov 09, 2024 | 1:33 PM

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కాలంలో అంచనాలకు మించిన లాభాల పెరుగుదలను చవి చూసింది. ముఖ్యంగా నికర లాభం 28 శాతం పెరిగింది. దేశంలోని ప్రజల ఆదరాభిమానాలు పొందిన బ్యాంకులలో స్టేట్ బ్యాంకు (ఎస్ బీఐ) ఒక్కటి. పల్లెల నుంచి పట్టణాల వరకూ దీనికి బ్రాంచ్ లున్నాయి. అలాగే సామాన్య ప్రజలకు సైతం ఈ బ్యాంకు బాగా దగ్గరైంది. కాగా. ఎస్ బీఐ 2024-25 ఆర్ఠిక సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి (జూలై – సెప్టెంబర్) సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. వాటి ప్రకారం లాభాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంచనాలకు మించి ఆదాయాన్ని సంపాదించింది. స్టాండలోన్ ప్రతిపదికను నికర లాభం 27.92 శాతం పెరిగి, రూ.18,331 కోట్లకు చేరింది.

గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.14,331 కోట్లు మాత్రమే ఉంది. సెప్టెంబర్ లో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయమే రూ.41,620 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి రూ.39,500 కోట్ల మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో 5.37 శాతం ఆదాయం పెరిగింది.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆపరేటింగ్ ప్రాఫిట్ జూలై – సెప్టెంబర్ లో 29.294 కోట్లకు చేరింది. గతంతో పోల్చితే 51 శాతం పెరిగింది. అంతకు ముందు ఈ మొత్తం 19,417గా ఉండేది. అయితే బ్యాంకు డిపాజిట్లు మాత్రం ఇదే సమయంతో పోల్చితే 9 శాతం తగ్గగా, వీటి విలువ రూ.51.17 లక్షల కోట్లుగా నమోదైంది.

బ్యాంకు కు చెందిన అనుబంధ సంస్థలకు సంబంధించి జీవిత బీమా విభాగ నికర లాభం ప్రథమార్థంలో రూ.1049 కోట్లు, క్రెడిట్ కార్డు విభాగంలో రూ.999 కోట్లు, ఫండ్ నిర్వహణ విభాగంలోరూ.1374 కోట్లు, సాధారణ బీమాకు సంబంధించి రూ.414 లాభాలు వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వీటి లాభాలు రూ761 కోట్లు, రూ.1196 కోట్లు, 940 కోట్లు, 60 కోట్లు మాత్రేమే ఉన్నాయి. బ్యాంకు చైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణవృద్ధి లక్ష్యాన్ని 14 నుంచి 16శాతం కొనసాగిస్తున్నామన్నారు. డిపాజిట్ల వృద్ధి లక్ష్యాన్ని మాత్రం 10 శాతానికి తగ్గించినట్టు వివరించారు. పండగల సమయంలో రిటైల్ రుణాలు పెరుగుతాయన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లాభాన్ని సాధించాలని బ్యాంకు భావిస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!