నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

Phani CH

|

Updated on: Nov 09, 2024 | 12:38 PM

ప్రస్తుతం నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ సామాన్యులకు ఊరట కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సబ్సిడీ కింద తక్కువ ధరకే భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను తిరిగి ప్రారంభించింది. వీటిని గతంలో కూడా విక్రయించగా, తాజాగా మళ్లీ కొనసాగిస్తోంది.

గతంలో మొదటి విడత ప్రారంభించగా, ఇప్పుడు రెండో విడతగా తక్కువ ధరల్లో నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఈ విక్రయాలను కొనసాగించనుంది ప్రభుత్వం. సామాన్యులకు అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రెండో విడతగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ రెండో విడతలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ స్టాక్‌ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ విడతలో కేవలం రూ.30లకే కిలో గోధుమ పిండిని విక్రయించనున్నట్లు, ఈ పిండి ప్యాకెట్లు 5, 10 కిలోలు ఉంటాయని తెలిపారు. అలాగే కిలో బియ్యం రూ.34కే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ బియ్యం బస్తా5,10 కిలోలు ఉంటుందని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ క్షణం నుంచే హెల్మెట్ మస్ట్.. లేకపోతే జాగ్రత్త !!

పెళ్లికూతురుని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ??

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

Puhspa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!