ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

Phani CH

|

Updated on: Nov 09, 2024 | 12:11 PM

దుబాయ్ అంటే.. మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఎడారి. ఎడారి ప్రాంతమని. ఆ దేశంలో మంచు పడదు. వర్షాలు సైతం కురవవు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా దేశంలో పలు వాతావరణ మార్పులు సంభవించాయి. దీంతో దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాజగా మంచు కురిసింది. దాంతో పర్వత ప్రాంతాలతోపాటు రహదారులు సైతం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

భారీగా మంచు కురుస్తుండడంతో.. రహదారులపై వాహనదారులు వైపర్స్ ఆన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. గత బుధవారం దేశంలోని ఉత్తర సరిహద్దులు.. రియాద్‌, మక్కాతోపాటు అల్ జాఫ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. ఇది అసిర్, తబుక్‌తోపాటు అల్ బహా ప్రాంతాలను సైతం ప్రభావితం చేసిందని స్థానిక వాచర్స్ డాట్ న్యూస్ వెల్లడించింది. ఇక సోమవారం అల్ జఫాలోని పర్వత ప్రాంతమంతా ముంచు దుప్పటి పరిచినట్లుగా మంచు కురిసింది. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్‌గా మారుతున్నాయి. దృశ్యాలను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురువడం ఇదే తొలిసారి అని ఒక నెటిజన్ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. భారీగా మంచు కురిసిందని తెలిపారు. ఈ సందర్బంగా ఆకాశంలో మెరిసిన ఇంద్రదనుస్సును సైతం నెటిజన్ కమ్రాన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలోని ఎడారిలో భారీ వర్షాల అనంతరం మంచు దుప్పటి పరుచుకుందని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిందని స్పష్టం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Puhspa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!

Puhspa 2: రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2

ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి

Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సుహాస్ సినిమా